అది తలుచుకుని గుక్క పట్టి ఏడ్చేసిన ఇంద్రజ..వీడియో వైరల్..!!

ఒకప్పుడు ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్స్ గా రాజ్యమేలేసిన వారు.. ఆ తర్వాత పెళ్లి చేసుకుని లైఫ్ లో సెటిలైపోయి పిల్లలు పుట్టిన తర్వాత మళ్లీ కెరియర్ పై ఆసక్తితో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన హీరోయిన్స్ బోలెడు మంది ఉన్నారు . ఆ లిస్ట్ లోకే వస్తుంది ఒకప్పటి అందాల తార ఇంద్రజ. ఇప్పుడు సీనియర్ పాత్రలు చేస్తున్న ఇంద్రజ ఒకప్పుడు తన అంద చెందాలతో ఎలా ఏలేసిందో మనకు బాగా తెలిసిందే. ఇంద్రజకు మళ్ళి లైఫ్ ఇచ్చింది జబర్దస్త్ అని చెప్పాలి.

సెకండ్ ఇన్నింగ్స్ లో ఇంద్రజ జబర్దస్త్ ద్వారానే పాపులారిటీ సంపాదించుకుంది. ఆ తర్వాత జబర్దస్త్ – ఎక్స్ ట్రా జబర్దస్త్- శ్రీదేవి డ్రామా కంపెనీ అంటూ రాజ్యమేలేస్తోంది . రీసెంట్గా శ్రీదేవి డ్రామా కంపెనీకి సంబంధించిన ప్రోమో రిలీజ్ అయింది . ఈ ప్రోమోలో ఇంద్రజ గుక్క పట్టి ఏడ్చేసిన క్లిప్స్ వైరల్ అవుతున్నాయి.

అయితే చాలాకాలం తర్వాత ఆమెకి ఇష్టమైన ట్రెడిషనల్ డాన్స్ వేసిందని అప్పుడు ఆమె డాన్స్ చూసిన జనాలు ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యామని ప్రశంసలతో ముంచెత్తుతారు. ఆ కామెంట్స్ వినగానే ఆమె గుక్క పట్టి ఏడ్చేసింది . అఫ్కోర్స్ ఓ నటికి ఒక కళాకారుణినికి ఇది చాలా ఇంపార్టెంట్ . అయినా సరే ఎమోషన్ ని కంట్రోల్ చేసుకోలేక ఇంద్రజ ఏడ్చేసింది . దీంతో సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ గా మారింది.