పైకి అమాయకంగా క‌నిపించే మ‌హేష్ ఆ విష‌యంలో అంత ముదురా.. పాపం న‌మ్ర‌త ఎలా భ‌రిస్తుందో..?

టాలీవుడ్ సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు బ‌ర్త్‌డే నేడు. ఈ నేప‌థ్యంలోనే ఆయ‌న‌కు అభిమానులు, సినీ ప్ర‌ముఖులు సోష‌ల్ మీడియా ద్వారా విషెస్ తెలుపుతున్నారు. మ‌రోవైపు మ‌హేష్ బాబు పుట్టిన‌రోజు సంద‌ర్భంగా ఆయ‌న‌కు సంబంధించి ఎన్నో ఆస‌క్తిక‌ర విష‌యాలు తెర‌పైకి వ‌స్తున్నాయి. కృష్ణ త‌న‌యుడిగా ఇండ‌స్ట్రీలోకి అడుగు పెట్టిన మ‌హేష్ బాబు.. తండ్రి త‌గ్గా త‌న‌యుడ‌ని నిరూపించుకున్నాడు.

సౌత్ లో మోస్ట్ స‌క్సెస్ ఫుల్ హీరోగా దూసుకుపోతున్నాడు. కోట్లాది ప్రేక్ష‌కుల‌ను తన అభిమానులుగా మార్చుకున్నాడు. ఐదు ప‌దుల వ‌య‌సుకు చేరువ‌వుతున్నా.. న‌వ‌య‌వ్వ‌నంగా క‌నిపిస్తూ అమ్మాయిల కల‌ల రాకుమారుడు అయ్యాడు. హీరోగా, నిర్మాత‌గా, వ్యాపార‌వేత్త‌గా స‌త్తా చాటుతూనే.. మ‌రోవైపు అనేక సేవ కార్య‌క్ర‌మాల ద్వారా రియ‌ల్ హీరో అనిపించుకుంటున్నాడు.

అయితే పైకి చాలా అమాయ‌కంగా క‌నిపించే మ‌హేష్ బాబుకు వెటకారం బాగా ఎక్కువ‌ట‌. షూటింగ్ స్పాట్ లో ఆయ‌న వేసే పంచ్ లకు యూనిట్ అందరు పొట్ట చెక్కలయ్యేలా నవ్వుతారట. ఎవ‌రైనా కౌంట‌ర్ వేస్తే.. క్ష‌ణాల్లో రివ‌ర్స్ కౌంట‌ర్ వేసేస్తార‌ట‌. ఈ విష‌యంలో మ‌హేష్ బాబు మ‌హా ముదుర‌ట‌. అందుకే సెట్స్ తో ఆయ‌నతో ప్ర‌తి ఒక్క‌రూ చాలా జాగ్ర‌త్త‌గా మాట్లాడ‌తార‌ట‌. ఇక న‌మ్ర‌త ఎలా భ‌రిస్తుందో ఏమీ కానీ.. ఇంట్లో కూడా మ‌హేష్ ఇలానే ఉంటాడ‌ని తెలుస్తోంది. కాగా, ప్ర‌స్తుతం ఈయ‌న త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌క‌త్వంలో `గుంటూరు కారం` సినిమా చేస్తున్నాడు. వ‌చ్చే సంక్రాంతికి ఈ మూవీ విడుద‌ల కానుంది. ఇది పూర్తైన వెంట‌నే రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో ఓ పాన్ ఇండియా ప్రాజెక్ట్ ను ప‌ట్టాలెక్కించ‌బోతున్నాడు.