ఏంటి పూజా.. నాగార్జున‌ను ప‌ట్టుకుని అంత మాట ఎలా అంటావ్‌..?

టాలీవుడ్ బుట్ట‌బొమ్మ పూజా హెగ్డే హ‌వా ఈ మ‌ధ్య బాగా ప‌డిపోయింది. వ‌రుసగా అర‌డ‌జ‌న్ ఫ్లాపులు ప‌డ‌టంతో.. పూజా హెగ్డేతో సినిమా అంటేనే హీరోలు భ‌య‌ప‌డిపోతున్నారు. పైగా ఇటీవ‌ల పూజా హెగ్డే చేతిలో ఉన్న గుంటూరు కారం, ఉస్తాద్ భ‌గ‌త్ సింగ్ వంటి భారీ ప్రాజెక్ట్ లు చేజారాయి. అయితే సినిమాలు లేక‌పోత‌నేం.. పూజా హెగ్డే బ్యాక్ టు బ్యాక్ యాడ్స్ లో న‌టిస్తూ గ‌ట్టిగానే వెన‌కేస్తోంది.

తాజాగా టాలీవుడ్ కింగ్ నాగార్జునతో క‌లిసి ఓ యాడ్ లో న‌టించింది. ఈ క్ర‌మంలోనే నాగార్జున‌ను ప‌ట్టుకుని పూజా ఏకంగా అన్న‌య్య అనేసింది. మాజా డ్రింక్ ను ప్ర‌మోట్ చేస్తూ.. చేసిన యాడ్ ఇది. ఇందులో ఫ్యామిలీ అంతా కూర్చుని ఉండ‌గా.. నాగార్జున తన శివ మూవీలోని పాటలను హమ్ చేస్తూ ఉంటాడు. ఇంట్లోని సభ్యులు కూడా సింక్ అయ్యి హమ్ చేస్తూ ఉంటే.. నాన్ సింక్ లో వచ్చి పూజ సాంగ్ ను దారుణంగా పాడుతుంది.

పూజా పాట‌ను చెడ‌గొట్ట‌డంతో.. అందరూ షాకౌతారు. కానీ, నాగ్ మాత్రం పాట బాగా పాడకపోయినా డ్యాన్స్ బాగా వేస్తుంది.. కదా అమ్మూ అని సపోర్ట్ చేస్తాడు. వెంటనే `అన్నయ్య` అని పిలుస్తుంది. ఆపై అంద‌రూ న‌వ్వుకుంటూ మ‌జా తాగుతారు. తాజాగా బ‌య‌ట‌కు వ‌చ్చిన నెట్టింట వైర‌ల్ గా మారింది. యాడ్ ను బాగానే షూట్ చేశారు.. కానీ, నాగార్జున‌ను పూజా అన్న‌య్య అని పిల‌వ‌డం హాట్ టాపిక్ అయింది. నాగ చైత‌న్య‌, అఖిల్ తో రొమాన్స్ చేసి.. ఇప్పుడు నాగార్జున‌ను అన్న‌య్య అని ఎలా అంటావ్ పూజా అంటూ నెటిజ‌న్లు స‌ర‌దాగా కామెంట్లు చేస్తున్నారు. మ‌రికొంద‌రు యాడ్ లో నాగార్జున లుక్ కు ఫిదా అవుతున్నారు. వ‌య‌సు పెరుగుతున్నా.. నాగార్జున అందం మాత్రం చెక్కు చెద‌ర‌డం లేదంటూ కామెంట్లు పెడుతున్నారు. మొత్తానికి వీరి యాడ్ మాత్రం బాగా వైర‌ల్ అవుతోంది.

 

View this post on Instagram

 

A post shared by Pooja Hegde (@hegdepooja)