వెంకీ – క‌మ‌ల్ కాంబోలో అగిపోయిన సూప‌ర్ హిట్ సినిమా ఇదే…!

లోకనాయకుడు కమల్ హాసన్, విక్టరీ వెంకటేష్ వీరిద్ద‌రిదీ ఓ క్రేజీ కాంబోనేే చెప్పాలి. గతంలో కూడా ఇద్దరూ కలిసి ఈనాడు అనే వైవిధ్యమైన సినిమాలో న‌టించిరు. ఈ సినిమాకు కమలహాసన్ కూతురు శృతిహాసన్ మ్యూజిక్ అందించండి. చక్రి తోలేటి ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. 2009లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఆశించిన స్థాయిలో విజయం సాధించలేకపోయింది.

గతంలో ఈ సినిమానే కాకుండా వెంకటేష్- కమల్ కాంబోలో మరో సినిమా రావాల్సి ఉందట.అయితే ఆ సినిమా షూటింగ్ మధ్యలోనే ఆగిపోయింది. ఇంతకీ ఆ సినిమా మరేదో కాదు `మర్మయోగి`.. చాలా ఏళ్ల క్రితం కమల్- వెంకటేష్ కాంబోలో మ‌ర్మయోగి అనే ఓ పీరియాటిక్ సినిమా రావ‌ల్సి ఉంది. అంతేకాకుండా ఈ సినిమానుకు కమలహాసన్ స్వయంగా కథ రాయడమే కాకుండా దర్శకత్వం కూడా ఆయనే చేశారు.

ఇక విధంగా ఈ సినిమా కాస్ట్యూమ్ ట్రైల్స్ కూడా ముగించుకొని షూటింగ్ కూడా మొదలుపెట్టి కొంత భాగం పూర్తయిన తర్వాత కొన్ని ఆనుకొని కారణాలతో ఈ సినిమా మధ్యలోనే ఆగిపోయింది. ఇదే విషయాన్ని గత సంవత్సరం కమలహాసన్ కు అదిరిపోయే హిట్ ఇచ్చిన విక్రమ్ సినిమా ప్రెస్ మీట్‌లో అయిన ఈ విషయాన్ని బయటపెట్టారు. మర్మయోగి సినిమా చేసి ఉంటే మా కెరీర్ లోనే ఎంతో గొప్ప సినిమా అయ్యేది. కానీ దురదృష్టవశాత్తు ఆ సినిమాని అగిపోయింది అంటూ క‌మ‌ల్ చెప్పుకొచ్చాడు. ఇక మ‌రీ రాబోయే రోజుల్లో అయ‌న వీరి కాంబోలో మ‌రో సినిమా వ‌స్తుందో లేదో చూడాలి.