‘ బావగారు బాగున్నారా ‘ మూవీ హీరోయిన్ రచన గుర్తుందా.. ఇప్పుడు ఏం చేస్తుందో తెలుసా..?

ఇండస్ట్రీకి అడుగు పెట్టిన‌ చాలా తక్కువ సమయంలో ప్రేక్షకులకు దగ్గరైన స్టార్ హీరోయిన్స్ లో రచ‌న కూడా ఒకటి. అందం, అభినయంతో, పాటు నట‌న‌తో ఎంతో మంది ప్రేక్షకులను ఆకట్టుకున్న రచన టాలీవుడ్ లో ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించింది. రచన అసలు పేరు జుం జుం రాకేష్ బెనర్జీ. సినిమాల్లోకి వచ్చిన తరువాత ఆమె పేరును రచనగా మార్చుకుంది.

చిరంజీవి సరసన బావగారు బాగున్నారా సినిమాలో నటించిన రచన కన్యాదానం, సుల్తాన్ రాయుడు, లాహిరి లాహిరి లాహిరిలో లాంటి హిట్ సినిమాలలో నటించి ఎంతోమంది ప్రేక్షకులను ఆకట్టుకుంది. అలా కెరీర్ మంచి ఫామ్ లో ఉన్న టైంలో రచన ప్రోబెల్ బసును పెళ్లి చేసుకుని ఇండస్ట్రీకి దూరమైంది. 2007లో ప్రోబెల్ బస్సుసు ను వివాహం చేసుకున్న రచనకు ఒక బాబు కూడా ఉన్నాడు.

ఇప్పుడు 50 ఏళ్ళు వయసు పైబ‌డినా ఆమె మాత్రం చెక్కుచెదరని అందంతో అందరినీ ఆకట్టుకుంటుంది. ప్రస్తుతం ఓ ప్రముఖ బెంగాలీ షోకు హోస్ట్‌గా వ్యవహరిస్తున్న రచన సోషల్ మీడియాలో మాత్రం ఎప్పుడూ యాక్టివ్ గా అస్సలు ఉండదు..