ఆనందం సినిమా హీరోయిన్ రేఖ వేదవ్యాస్ ఇప్పుడు ఎలా ఉందో తెలుసా..?

రేఖ వేదవ్యాస్.. ఈ పేరు వినగానే చాలామందికి గుర్తుకు రాక‌పోవచ్చు కానీ ఆనందం మూవీ హీరోయిన్ అనగానే ఠ‌క్కున గుర్తుకు వస్తుంది. ఆనందం మూవీ అప్పట్లో టాలీవుడ్ సూపర్ హిట్ గా నిలిచింది. ఈ సినిమాలో రేఖ తన అందం, అభిన‌యంతో ఎంతోమంది ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ సినిమా అనంతరం వరుస ఆఫర్లు అందుకున్న రేఖ.. జాబిలి , ఒకటో నెంబర్ కుర్రాడు, జానకి వెడ్స్ శ్రీరామ్‌, అనగనగా ఒక కుర్రాడు, దొంగోడు లాంటి ఎన్నో హిట్ సినిమాల్లో నటించి ఎంతోమంది ఫాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది.

ఆ తరువాత పెద్దగా అవకాశాలు రాకపోవడంతో ఇండస్ట్రీకి దూరమైంది రేఖ వేదవ్యాస్ చివరిగా జీనియస్ సినిమాలో నటించింది. ఈ సినిమాలో ఓ స్పెషల్ సాంగ్ లో మెరిసింది. రేఖ తెలుగుతోపాటు కన్నడ సినిమాల్లోనూ నటించి మెప్పించింది. తెలుగులో చాలా తక్కువ సినిమాల్లో నటించిన ఈమె కన్నడలో చాలా సినిమాల్లో నటించింది. ఇప్ప‌టికి అదే చెక్కుచెదరని అందంతో ఉన్న రేఖ కాస్త బొద్దుగా మరింత క్యూట్‌గా తయారైంది.

ఈ ముద్దుగుమ్మ సినిమాలకు దూరమైనా సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటుంది. వరుస‌ ఫోటోషూట్లతో గ్లామర్ ఆరబోతతో కుర్రకారును పిచ్చెక్కిస్తుంది. ఇప్పటికీ అదే అందంతో ఉన్న ఈ భామ ఇటీవల కాలంలో గ్లామర్ డోస్‌ మరింతగా పెంచింది. ఇప్పుడు ఈమె గ్లామర్ ఫోటోస్ సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతు కుర్రాళ‌ను మరింతగా టెంప్ట్ చేస్తున్నాయి.