‘ భోళాశంక‌ర్ ‘ ఇంత పెద్ద రాడ్ రంబోలా అవ్వ‌డానికి ఆ ఇద్ద‌రే కార‌ణ‌మా…!

టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో చిరంజీవి హీరోగా మెహర్ రమేష్ డైరెక్షన్‌లో భోళా శంకర్ సినిమా ఆగస్టు 11న రిలీజై మొదటి షో నుంచే నెగటివ్ టాక్ ను సంపాదించుకున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమా కలెక్షన్స్ కోలుకునేది లేదనే క్లారిటీ కూడా వచ్చేసింది. ఈ సినిమా ఫ్లాప్ అవ్వడానికి కారణం ఇదే అంటూ రెండు రకాల చర్చలు నడుస్తున్నాయి. సరిగ్గా రిలీజ్‌కు కొన్ని రోజుల ముందు చిరంజీవి ఆంధ్రప్రదేశ్ సర్కార్ పై, కొంతమంది మంత్రులపై పరోక్షంగా కామెంట్ చేశాడు.

ప్రత్యేక హోదా, సంక్షేమ పథకాలు, ఉపాధి హామీలు లాంటి వాటిని పట్టించుకోవడం మానేసిన గవర్నమెంట్ మాపై పడి ఏడిస్తే ఏమొస్తుంది అంటూ పరోక్షంగా పొలిటికల్ కామెంట్స్ విసిరాడు. ఈ ప్రభావం భోళాశంకర్ సినిమాపై గట్టిగా పడిందంటూ.. కొన్ని పార్టీల కార్యకర్తలు.. చిరంజీవి సినిమాపై దృష్టి పెడితే మంచిదని సరిగ్గా ఎన్నికల టైం లో ఇలాంటి రాజకీయ అనౌన్స్మెంట్ ఇవ్వడం వలన నీకే నష్టం అంటూ కామెంట్స్ చేశారు. ఈ నేపథ్యంలోనే ఓవర్గం సినిమాను పూర్తిగా పక్కన పెట్టిందని.. నెగిటివ్ ప్రచారం చేసి సినిమా ప్లాప్ అవ్వడానికి కారణమైందంటూ విమర్శలు వినిపిస్తున్నాయి.

మరోపక్క కొంతమంది వాదన ఏంటంటే సినిమా బాగుంటే పొలిటికల్ విమర్శలు ఏమాత్రం ప్రభావం చూపించవు. నిజంగా కంటెంట్ లో దమ్ముంటే రాజకీయాలతో సంబంధం లేకుండా కామన్ ఆడియో సినిమాను హిట్ చేస్తారు. ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్ల ముందు క్యూ కడతారు అంటూ కామెంట్ చేస్తున్నారు. భోళా శంకర్ రాడ్ రంబోలా అవ్వడానికి కారణం మెహర్ రమేష్ టేకింగ్ అని వీళ్ళ వాదన.

పాత చింతకాయ పచ్చడి సినిమాని తీసుకుని మరింత కిచిడీగా మార్చేసాడ‌ని.. చిరంజీవి లాంటి సీనియర్ నుంచి.. మహానటి లాంటి కీర్తి సురేష్ నుంచి.. మంచి అవుట్పుట్ రాబ‌ట్టుకోవడంలో పూర్తిగా మెహర్ రమేష్ ఫెయిల్ అయ్యాడని వీళ్ళు వాదిస్తున్నారు. కారణం ఏదైనా ప్లాప్ సినిమాకి రెండు రకాలుగా ఇలాంటి వాదనలు రావడం చర్చనీయాంశం అయింది. రాజకీయాలతో సంబంధం లేని జనం మాత్రం ఈ ట్రెండ్‌కి తగ్గట్టు కథ లేకపోవడమే సినిమా ప్లాపు కారణం అంటూ తేల్చేశారు. ఇక సినిమా ప్లాప్ అవడంతో మెహర్ రమేష్ పూర్తిగా వెలుగులోకి రావడం మానేశాడు.