టాలీవుడ్ లో భారీ నష్టాలు… ఈ ఏడాది డిజాస్టర్లుగా మిగిలిన చిత్రాలు ఇవే…

టాలీవుడ్ లో ఒక స్టార్ హీరో సినిమా విడుదలవుతోంది అంటే రాష్ట్రమంతా పండగ వాతావరణం మొదలవుతుంది. సినిమా రిలీజ్ అయ్యి రికార్డులు బద్దలు కొడుతోంది అనే ఊహలోనే ఉంటారు అందరు. ఈ ఊహ నూటికి తొంభై శాతం నిజమవుతుంది కూడా. కానీ ఈ ఏడాది ఈ ఊహ తారుమారైంది. ఈ సంవత్సరం విడుదలైన పెద్ద హీరోల చైత్రాలన్నీ బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్లుగా మిగిలిపోయాయి. ఈ ఏడాది చిన్న సినిమాల హావా కొనసాగుతోంది. భారీ అంచనాలతో, భారీ బుడ్జెట్లతో విడుదలైన చిత్రాలు ప్రేక్షకులను మెప్పించలేకపోయాయి. బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొట్టి ప్రొడ్యూసర్లకు భారీ నష్టాలను మిగిల్చాయి. అలంటి సినిమాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

అన్నిటి కంటే ముందు మనం మాట్లాడుకోవాల్సిన సినిమా “భోళాశంకర్”. మెహెర్ రమేష్, మెగా స్టార్ చిరంజీవి కాంబోలో వచ్చిన ఈ చిత్రం భారీ అంచనాలతో విడుదలయింది. కానీ ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద ఘోరమైన డిజాస్టర్గా మిగిలింది. ఈ చిత్రం సుమారు 53 కోట్ల రూపాయలు రాష్టాన్ని మిగిల్చిందని సమాచారం. ఇక మనం మాట్లాడుకువాల్సిన రెండో చిత్రం మన పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన “ఆదిపురుష్”. బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద విఫలం అవ్వడమే కాకుండా, అనేక విమర్శలకు దారితీసింది. ఈ చిత్రం కూడా ప్రొడ్యూసర్లకు సుమారు 50 కోట్లు నష్టం మిగిల్చిందని సమాచారం. సమంత లీడ్ రోల్ గా, దిల్ రాజు నిర్మించిన చిత్రం “శాకుంతలం”. ఇది ఒక మైథలాజికల్ డ్రామా. గుణ శేఖర్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఐతే ఈ చిత్రం కూడా ఆశించిన విజయాన్ని సాధించాలేదు. ఈ సినిమా కూడా ప్రొడ్యూసర్ కి భారీ నష్టాలు మిగిల్చిందని సమాచారం.

అఖిల్ హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో వచ్చిన చిత్రం “ఏజెంట్”. ఈ చిత్రం కూడా భారీ బడ్జెట్ తో తెరకెక్కింది. భారీ సెట్స్, యాక్షన్ సెక్యూన్సెస్ తో తెరకెక్కిన ఈ యాక్షన్ సినిమా ఇండియా వైడ్ రిలీజ్ చేసారు. ఈ చిత్రం అఖిల్ కు పాన్ ఇండియా ఎంట్రీ పాస్ అనుకున్నారు అంతా. కానీ ఈ సినిమా కూడా డిసాస్టర్ గానే మిగిలింది. ఈ సినిమా తో 33 కోట్ల రూపాయలు నష్టాన్ని మూటగట్టుకున్నాడట ప్రొడ్యూసర్. ఇక పోతే తాజాగా విడుదలైన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చిత్రం “బ్రో” కూడా ప్రేక్షకుల అంచనాలను అందుకోలేకపోయింది.

ఈ సినిమా కూడా 31 కోట్ల రూపాయల నష్టాన్ని మిగిల్చిందని సమాచారం.