పీక‌ల్లోతు లవ్‌లో ఉన్న అమ్మాయిలు కూడా ఐ ల‌వ్ యూ చెప్పాలంటే ఇన్ని రోజులు వెయిట్ చేస్తారా ?

గర్ల్ ఫ్రెండ్, బాయ్ ఫ్రెండ్ కు ఐ లవ్ యూ చెప్పడానికి ఎన్ని రోజులు పడుతుంది? శాస్త్రవేత్తలు తన పరిశోధనల ద్వారా ఈ విషయాన్ని తెలిపారు. ఏడు దేశాలకు చెందిన యువకుల నుంచి సమాధానాలు సేకరించి పరిశోధకులు పలు ఆశ్చర్యమైన విషయాలని వెల‌డించారు. ఎవరైనా యువతి తన బాయ్ ఫ్రెండ్ కు ఐ లవ్ యు చెప్పేందుకు 122 రోజులు తీసుకుంటుందని సైంటిస్టులు చెప్పారు. యువకులు తమ ప్రేమను త్వరగా వ్యక్తం చేస్తారన్నారు. ఈ పరిశోధనను స్కాట్ల్యాండ్‌కి చెందిన ఎబర్ట్ యూనివర్మటీ శాస్త్రవేత్తలు నిర్వహించారు.

ది బ్రిటిష్ సైకాలజికల్ సొసైటీ ద్వారా వెల‌డైన‌ ఈ రిపోర్ట్‌లో విభిన్న సంస్కృతుల కలిగిన పలు దేశాల్లోని యువకుల నుంచి ఈ సమాచారాన్ని సేకరించారు. ఈ బృందం ఆస్ట్రేలియా, బ్రెజిల్, చిలీ, కొలంబియా, ఫ్రాన్స్, పోలాండ్, యువకులకు చెందిన 3,109 మంది యువకులను ఈ పరిశోధనలో భాగస్వాములను చేశారు. వీరులో 70 శాతం మంది యువతులు, 30% మంది యువకులు ఉన్నారు. వారి ముందు కొన్ని ప్రశ్నలను ఉంచి, వాటికి సమాధానాలు తెలుసుకునే ప్రయత్నం చేశారు.

అలాగే వారు భాగస్వామికి ఎన్ని రోజులకు ఐ లవ్ యూ చెప్పారు తెలుసుకునే ప్రయత్నం చేశారు. 60 శాతం యువకులు తన గర్ల్ ఫ్రెండ్ కు 70 రోజుల తరువాత ఐ లవ్ యు చెప్పారని వెళ్లడయ్యింది. యువతులతో పోలిస్తే యువకులు 15 రోజుల ముందుగానే తన గర్ల్ ఫ్రెండ్ కు ప్రపోజ్ చేస్తున్నారని కనుక్కున్నారు. యువతలు ఐ లవ్ యు చెప్పేందుకు కనీసం 70 రోజులు తీసుకుంటున్నారని, గరిష్టంగా 122 రోజుల సమయం తీసుకుంటున్నారని పరిశోధనలో వెల్లడైంది.