నటుడు సునీల్ కష్టానికి గుర్తింపు లభించినట్టేనా..?

తెలుగు సినీ ఇండస్ట్రీలో కమెడియన్ సునీల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కమెడియన్ గా మొదట ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన తర్వాత పలు చిత్రాలలో హీరోగా కూడా నటించి మంచి క్రేజ్ సంపాదించుకున్నారు. కానీ హీరోగా సక్సెస్ కాలేకపోవడంతో ఆ తరువాత పలు చిత్రాలలో కీలకమైన పాత్రలో నటిస్తూనే విలన్ గా కూడా ఎన్నో సినిమాలలో నటించి మెప్పించారు. ఈ మధ్యనే సెకండ్ ఇన్నింగ్స్ ని కూడా మొదలుపెట్టి పలు రకాల క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటిస్తూ మంచి క్రేజ్ అందుకుంటున్నారు.

Sunil sports keikogi in his first look from Rajinikanth's Jailer, see photo  | Tamil News - The Indian Express

విరూపాక్ష, పుష్ప వంటి చిత్రాలలో కనిపించిన సునీల్ పలు చిత్రాలలో నెగటివ్ పాత్రలో కూడా నటించారు.. అయితే కమెడియన్ గా సునీల్ ని ప్రస్తుతం చూడలేకపోయినా అభిమానులు మాత్రం విలన్ గా అందరినీ మైమరిపిస్తున్నారని చెప్పవచ్చు. సునీల్ ఇప్పుడు తెలుగులో కంటే తమిళంలో ఎక్కువగా ఆఫర్లు వస్తున్నాయట.. అది కూడా కమెడియన్ గా పలు రకాల రోల్స్ వస్తున్నట్లు సమాచారం.. తెలుగు తమిళం భాషలలో ఆయన నటించాలని అక్కడ మేకర్స్ భావిస్తున్నట్లు సమాచారం.

ఇటీవల రజనీకాంత్ నటించిన జైలర్ సినిమాలో కీలకమైన పాత్రలో నటించారు సునీల్.. ఈ పాత్ర తను 100% న్యాయం చేశారని.. దీంతో తమిళంలో అభిమానులు సైతం తన నటనకు ఫిదా అయ్యారు.. దీంతో తమిళంలో ఇతర సినిమాలలో కూడా ఆయనను తీసుకోవాలని దర్శక నిర్మాతలు సైతం సునీల్ ని అప్రోచ్ అవుతున్నట్లు తెలుస్తోంది. ఇక్కడ గమనించదగ్గ విషయం ఏమిటంటే.. జైలర్ సినిమాలో సునీల్ పాత్ర ఆడియోస్ని బాగా ఫిదా చేసినట్టు తెలుస్తోంది.. అయితే తెలుగు ప్రేక్షకులకు మాత్రం పెద్దగా నచ్చలేదట కానీ తమిళ ప్రేక్షకులకు నచ్చడంతో సునీల్ కష్టం వృధా కాలేదని చెప్పవచ్చు.