మరొకసారి హాట్ డాన్స్ తో రచ్చ చేస్తున్న సుప్రీతా.. సురేఖ వాణి.. వీడియో వైరల్..!!

తెలుగు సినీ ఇండస్ట్రీలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా మంచి పాపులారిటీ సంపాదించింది నటి సురేఖ వాణి.. గడిచిన రెండు సంవత్సరాల క్రితం ఈమె భర్త మరణించడంతో తన ఫోకస్ మొత్తం ఎక్కువగా తన కూతురు సుప్రీతా మీద పెట్టింది.. వీరిద్దరూ సోషల్ మీడియాలో చేసేటువంటి రచ్చ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. అప్పుడప్పుడు పలు రకాల పార్టీలకు పబ్బులకు వెళ్తూ నానా హంగామా చేస్తూ ఉంటారు. మరి కొన్నిసార్లు గ్లామర్ ఫోటోలను సైతం షేర్ చేస్తూ అందరిని ఆశ్చర్యపరుస్తూ ఉంటారు.

తాజాగా సురేఖ వాణి తన కూతురుతో కలిసి కిరణ్ అబ్బవరం నేహా శెట్టి జంటగా నటించిన రూల్స్ రంజాన్ సినిమాలోని “సమ్మోహనుడా” అనే పాట ఎంత వైరల్ గా మారుతుందో తెలిసిన విషయమే అయితే ఈ పాటకి సుప్రీత తన కూతురుతో కలిసి అదిరిపోయే హాట్ డాన్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారుతోంది. ఈ పాటలో కూడా నేహా శెట్టి అందాల ఆరబోత కుర్రకారులను మెస్మరైజ్ చేస్తోంది.. ఈ పాటకి చాలా మంది సెలబ్రిటీలు ప్రేక్షకులు కూడా రీల్స్ చేస్తూ ఉన్నారు.

తాజాగా సురేఖ వాణి తన కూతురితో కలిసి ఈ పాటకి అదిరిపోయేలా డాన్స్ వేయడంతో పాటు చీర కట్టులో మరింత అందంగా కనిపిస్తూ తమ అందచందాలతో అదిరిపోయేలా డాన్స్ చేస్తూ ఉన్నారు.. అయితే ఇలా వీరిద్దరూ ఈ పాటకే కాకుండా పాపులర్ అయిన ప్రతి పాటకు కూడా తల్లి కూతుర్లు కలిసి సోషల్ మీడియాలో ఇలా రీల్స్ చేస్తూ ఉంటారు.. సుప్రీతా తన గ్లామర్ వలకబోసే విధంగా హాట్ ఫొటోస్ కూడా షేర్ చేస్తూ ఉంటుంది. వీరిద్దరిని చూస్తే తల్లి కూతుర్ల కాకుండా అక్కాచెల్లెళ్ల కనిపిస్తూ ఉంటారని చెప్పవచ్చు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారుతోంది.

 

View this post on Instagram

 

A post shared by Bandaru Supritha Naidu (@_supritha_9)