చిరంజీవి సినిమాలపై సంచలన వ్యాఖ్యలు చేసిన తమ్మారెడ్డి..!!

ఇటీవల చిరంజీవి నటించిన భోళా శంకర్ సినిమా బాక్సాఫీస్ వద్ద విడుదలై బోల్తా పడిన సంగతి తెలిసిందే.. ఈ క్రమంలోనే చిరంజీవి మాస్ ఓరియంటెడ్ పాత్రలకు దూరంగా ఉండాలని సీనియర్ డైరెక్టర్ తమ్మారెడ్డి భరద్వాజ్ తెలియజేయడం జరుగుతోంది.. బోలా శంకర్, లూసిఫర్ వంటి రీమిక్స్ చిత్రాలతో చిరంజీవి అభిమానులను నిరుత్సాహపరచడం కంటే నేచురల్ సినిమాలు చేయడమే మంచిదని చిరంజీవికి తగ్గ వయసు పాత్రలను చేయాలంటూ ఆయన అభిప్రాయంగా తెలియజేస్తున్నారు.. అయితే ఈ విషయాన్ని చిరంజీవితో చెప్పాలనుకున్నప్పటికీ అది సాధ్యం కాలేదనే విషయాన్ని తెలియజేశారు.

తాజాగా ఒక ఇంటర్వ్యూలో తమ్మారెడ్డి మాట్లాడుతూ సహజత్వంతో కూడిన సినిమాలు చేయడం వల్లే చిరంజీవి మెగాస్టార్ అయ్యారని చిరంజీవి అందరి కుటుంబంలో ఒక వ్యక్తిగా కనిపించే వారని అలా కనిపిస్తేనే చిరంజీవి సినిమాలు మళ్లీ ఆడుతాయని తెలిపారు.. దంగల్ వంటి నేచురల్ ఫిలిం తో చిరంజీవి నటించిన ప్రేక్షకులు చూస్తారని ఆయన అప్పట్లో సినిమాలలోకి వచ్చిన వారికి పని తప్ప మరే ఆలోచన కూడా లేకూడదని ఇప్పటి సినిమా పైన ప్రేమ ఉన్నవాళ్లు చాలామంది వ్యాపారంగా దీన్ని చేసుకుంటున్నారని తెలిపారు.

అయితే ఒకప్పుడు రచయితలు కూడా సూటిగానే కథలు చెప్పేవారు.. ఇప్పుడు మాత్రం ఓపెన్ చేస్తే టాప్ యాంగిల్ షాట్ అంటూ ఎలిమినేషన్ చేస్తూ ఉన్నారని అందుకు కారణం దర్శకులే అని తెలియజేశారు.. ప్రేక్షకులకు ఉపయోగపడే ఏదో ఒక అంశంతో కథ ఉండాలని ఇది సహజంగా ఉండాలని కూడా తెలియజేశారు.. ఇలాంటి వాటిని పక్కన పెట్టి ఏదో చేస్తున్నాము రెమ్యూనరేషన్ కోసం అంటే సినిమాలు ఆడటం కష్టమని తెలిపారు.. ఎన్టీఆర్ కృష్ణ ఏఎన్ఆర్ చిరంజీవి అంటే హీరోలంతా కూడా తమ కెరియర్లో మెథడ్ యాక్టింగ్ చేశారని తెలిపారు.. అందుకే అప్పట్లో చిరంజీవి సినిమాలు కూడా మంచి ప్రేక్షక ఆదరణ పొందాయని తెలిపారు.