బిగ్‌బాస్ 7 హోస్ట్‌గా నాగార్జున కన్ఫర్మ్ ….రెమ్యూనరేషన్ ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే !!!

బుల్లి తెర పై ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్న షో బిగ్ బాస్. ఇప్పటికే ఆరు సీజన్లు పూర్తి చేసుకున్న ఈ షో, ఇప్పుడు తాజాగా ఎడొవ సీజన్ తో మనముందుకు రాబోతోంది. జూనియర్ ఎన్టీఆర్,నాని, నాగార్జున వంటి స్టార్లు ఈ షో కు గతంలో హోస్ట్ లుగా వ్యవహరించిన విషయం అందరికి తెలిసిందే. ఐతే కొన్నాళ్లుగా బిగ్ బాస్ 7 హోస్ట్ గా ఒక లేడీ ఉండబోతోందనే వార్తలు సోషల్ మీడియాలో హల్చల్ చేసాయి. ఈ అపోహలన్నిటిని తొలగిస్తూ మళ్ళి నాగార్జుననే హోస్ట్ గా ప్రకటించింది బిగ్ బాస్ యాజమాన్యం.

అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న బిగ్ బాస్ 7 త్వరలోనే ప్రారంభం కాబోతోంది. ముహూర్తం కూడా దాదాపు ఖరారు ఐనట్టే. మొదట సెప్టెంబర్ ఒకటి నుంచి మొదలవుతుందని నిర్వాహకులు తెలిపినప్పటికీ, కొన్ని అనుకోని కారణాల వలన ఆలస్యంగా సెప్టెంబర్ మూడు నుంచి ఈ షో ప్రారంభం కాబోతోంది. ఈ డేట్ ను ఆఫీషియల్ గా అనౌన్స్ చేసారు మేకర్స్. ఈసారి బిగ్ బాస్ హౌస్ లో 16 మంది కంటెస్టెంట్స్ పాల్గొంటున్నారని సమాచారం. ఈ సీజన్ 106 రోజుల పాటు కొనసాగుతుంది.

ఇకపోతే బిగ్ బాస్ సీజన్ 7 గురించి చర్చనీయాంశంగా మారిన విషయం హోస్ట్ నాగార్జున పారితోషకం. బిగ్ బాస్ మూడోవ సీజన్ నుంచి ఆరొవ సీజన్ వరకు బిగ్ బాస్ హోస్ట్ గా వ్యవహరించారు నాగార్జున. ఐతే ఆయన గతంలో సీజన్ కు 5 కోట్లు అందుకున్నారు. కానీ ఇప్పుడు తాజాగా రాబోతున్న సీజన్ 7 కు మాత్రం ఆయన ఏకంగా 20 కోట్ల రూపాయలు పారితోషకం అందుకోబోతున్నారని సమాచారం. బిగ్ బాస్ షో వారమంతా ప్రసారమవుతుంది కానీ హోస్ట్ కనిపించేది మాత్రం శని, ఆది వారలు మాత్రమే. అంటే 15 వారాలకు కేవలం 30 రోజులు. 30 రోజులకు 20 కోట్లు అంటే నిజంగా ఆశ్చర్యపోవాల్సిన విషయమే.