ర‌జ‌నీకాంత్ సినిమాలో బాల‌య్య‌.. ఈ సారి ప‌క్కా ఫిక్స్‌…!

సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా.. నెల్సన్ దిలీప్ డైరెక్షన్లో రూపొందిన సినిమా ‘ జైలర్ ‘.. ఆగస్టు 10న రిలీజై సూపర్ సక్సెస్ అందుకుంది. మొదటిరోజు మొదటి షో తోనే హిట్ టాక్ ని దక్కించుకున్న ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల భీభత్సవాన్ని సృష్టిస్తుంది. మరో టాలీవుడ్ సీనియర్ హీరో చిరంజీవి నటించిన ‘ భోళాశంకర్ ‘ ఫ్లాప్ అవడంతో జైలర్‌కి మరింత కలిసి వచ్చిందని చెప్పాలి.

ఇదిలా ఉంటే జైలర్ సినిమా హిట్ అవ్వడంతో డైరెక్టర్ నెల్సన్ ” జైలర్ 2 ” కూడా ఉంటుందని అనౌన్స్ చేశాడు.ఇక జైలర్ సినిమాలో రజనీతో పాటు బాలయ్యను కూడా ఓ కీలక పాత్రకి అనుకున్నాడట. బాలయ్య క్యారెక్టర్ కు తగిన విధంగా సినిమాలో క్యారెక్టర్ రూపొందించలేకపోయానని ఆ ఉద్దేశంతో బాలయ్యకి కథను వినిపించలేదని చెప్పుకొచ్చాడు.

ఇక జైలర్ 2 చేయడం జరిగితే ఈసారి బాలయ్య మాత్రం పక్కా ఉంటాడని నెల్సన్ వివరించాడు. ఇక జైలర్ 2 సినిమా విషయంలో తలైవా ఫాన్స్ ఎంతో ఆసక్తిగా ఉన్నారు. జైల‌ర్ 2 సినిమా వచ్చే ఏడాది రిలీజై మరోసారి ఫ్యాన్స్ కి రజిని స్టామినా చూపిస్తుందని అంటున్నారు. ఇక కలెక్షన్ లో విషయానికొస్తే నిన్నటితో ఈ సినిమా రూ.400 కోట్ల గ్రాస్ వసూళ్లు దక్కించుకొని కొత్త రికార్డ్స్ సృష్టించిందట‌.