నాగార్జున సినిమా కూడా రీ రిలీజ్‌… ఏంటా సినిమా… డేట్ ఎప్పుడంటే…!

ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో రీ రిలీజ్ ట్రెండ్ నడుస్తోంది. తమ అభిమాన స్టార్ హీరోల సినిమాలు థియేటర్స్ లో రీరిలీస్ కావడంతో ప్రేక్షకులు కూడా ఆసక్తిగా థియేటర్స్ కి వెళ్లి సినిమాను వీక్షిస్తున్నారు. ఇప్పటికే టాలీవుడ్ సీనియర్ హీరోల సినిమాలు మొదలుకొని యంగ్ హీరోల సినిమాల వరకు ప్రతి ఒక్కరి సినిమా కూడా తిరిగి ప్రేక్షకులు ముందుకు వచ్చాయి. ఎంతో అద్భుతమైన ఆదరణ పొందాయి. ఇదే నేపథ్యంలో టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో కింగ్ నాగార్జున నటించిన మన్మధుడు సినిమా కూడా త్వరలోనే రీ రిలీజ్ అయి ప్రేక్షకుల ముందుకి రాబోతుంది.

అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై స్వయంగా నాగార్జున ప్రొడ్యూసర్ గా వ్య‌వ‌హ‌రించిన‌ ఈ సినిమాకు విజయభాస్కర్ దర్శకత్వం వహించాడు. నాగార్జున, సోనాలి బింద్రే, అన్ను నటీనటులుగా కనిపించిన ఈ సినిమా అప్పట్లో భారీ విజయాన్ని అందుకుంది. 2002వ‌ సంవత్సరం ప్రేక్షకుల ముందుకి వచ్చిన ఈ సినిమా సెన్సేషనల్ హిట్గా నిలిచింది. ఇప్పటికీ ఈ సినిమా టీవీలో వస్తుందంటే చాలు కోట్లాదిమంది ప్రేక్షకులు ఆసక్తిగా చూస్తారు. ఇలా నాగార్జున కెరీర్‌లోనే మెస్మరైజింగ్ మూవీగా పేరు తెచ్చుకున్న మన్మధుడు మూవీ మళ్లీ తిరిగి ప్రేక్షకులు ముందుకి రాబోతుందట.

ఈ నెల 29న భారీ ఎత్తున రిలీజ్ చేయబోతున్నట్లు ప్రకటించారు మేక‌ర్స్‌. కాగా ఇటీవల వచ్చిన నాగార్జున సినిమాలు డిజాస్టర్ కావడంతో ఈ సినిమాతో ఎలాగైనా మంచి హిట్ నాగార్జునకు ఇవ్వాలని గట్టిగా ఫిక్స్ అయ్యారు అక్కినేని ఫ్యాన్స్. ఎట్టకేలకు నాగార్జున హిట్ సినిమా అయిన మన్మధుడు కూడా రీరిలీజ్‌ ట్రైండ్‌లో జాయిన్ అవ్వడంతో ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ సినిమా అయినా రిలీజై బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్స్ రాబడుతుందో లేదో చూడాలి.