కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్ హీరోగా త్రిష హీరోయిన్ గా దర్శకుడు లోకేష్ కనగరాజ్ కాంబినేషన్లో రూపొందుతున్న మూవీ లియో. భారీ బడ్జెట్తో ప్రతిష్టాత్మకంగా ఈ సినిమా తెరకెక్కనుంది. ఈ మూవి అనౌన్స్ చేసినప్పటి నుంచే మంచి హైప్ తెచ్చుకుంది. పాన్ ఇండియా లెవెల్‌లో రిలీజ్ కాబోతున్న ఈ సినిమా అన్ని ప్రాంతాల్లో థియేట్రికల్, నాన్‌దియట్రికల్ హక్కులు అత్యంత భారీ రేటుకు అమ్ముడుపోయాయని తెలుస్తుంది.
ఏకంగా రూ.400 కోట్లకు పైగా బిజినెస్ రిజిస్టర్ చేసినట్లు కోలీవుడ్ సినీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం. దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఇక 19 అక్టోబర్ 2023న రిలీజ్ కాబోతున్న ఈ సినిమాపై కోలీవుడ్ ప్రేక్షకులతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న విజయ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
ఇదే రోజున టాలీవుడ్ నందమూరి నటసింహ బాలయ్య భగవంత్ కేసరి సినిమా కూడా రిలీజ్ కాబోతుంది దీంతో బాక్స్ ఆఫీస్ వద్ద లియో భగవంత్ కేసరి మధ్యన గట్టి పోటీ జరగబోతుందని అర్థమవుతుంది. ఈ రెండు సినిమాల్లో ఏ సినిమా బాక్సాఫీస్ వద్ద సక్సెస్ సాధిస్తుందో చూడాలి.