పెళ్లి చేసుకోబోతోన్న అనుష్క‌… చెప్పేసిందిగా ( వీడియో )

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క యంగ్ హీరో నవీన్ పోలిశెట్టి జంటగా మిస్‌శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. పి.మహేష్ బాబు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా నుంచి ఇటీవల టీజర్ రిలీజై ప్రేక్షకుల్లో మంచి ఆదరణ సంపాదించుకుంది. ఈ మూవీ తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషలలో సెప్టెంబర్ 7న థియేటర్లలో గ్రాండ్ గా రిలీజ్ కాబోతోంది. ఈ నేపథ్యంలో మూవీ ప్రమోషన్స్ యాక్టివ్ గా జరుగుతున్నాయి.

తాజాగా ఓ ఇంటర్వ్యూలో నవీన్ పాల్గొన్నాడు. ఇందులో భాగంగా నవీన్ కు అనుష్క శెట్టి ఫోన్ చేసి మరి తన పెళ్లి ఈవెంట్ గురించి మాట్లాడింది. మా ఇంట్లో ఫ్యామిలీ ఫంక్షన్ ఉంది మీరు ఓ ప్రొఫెషనల్ స్టాండప్‌ కమెడియన్ అని టీజర్ లో చూశాను. మీరు బయట కూడా ఈవెంట్స్ చేస్తుంటారని విన్నాను. మా ఇంట్లో ఫంక్షన్‌కి అవ‌స‌రం లేని కామెడీ చేయాల‌ని మీరు సెప్టెంబర్ 7న ఫ్రీగా ఉంటారా అని నవీన్‌ని అడుగుతుంది. ఆ చేస్తాను ఇంతకీ ఫంక్షన్ ఏంటో చెప్పండి అంటాడు.

అనుష్క నా పెళ్లి అని చెబుతుంది మీ పెళ్ళా అని నవీన్ అడుగుతాడు. ఇలా వీరిద్దరి మధ్యన ఒక ఫన్నీ కాన్వర్జేషన్ కొంతసేపు నడిచింది. ఇక్కడ విషయం ఏంటంటే మిస్‌శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమా ప్రమోషన్ లో నవీన్ ఇంటర్వ్యూ లో అనుష్క ప్రాంక్ కాల్ చేసి అత‌డితో మాట్లాడింది. మూడు నిమిషాలు ఈ సంభాషణలో మాట్లాడేది అనుష్క అని గుర్తించలేక పోతాడు నవీన్. చివరికి అనుష్క ఫోన్ కాల్ మాట్లాడిందని తెలిసి నవ్వుకుంటాడు.