దీపికా ముద్దు… న‌య‌న‌తార వ‌ద్దు…. జ‌వాన్ టీంకు షాక్ ఇచ్చిన న‌య‌న్‌…!

ప్రస్తుతం సౌత్ ఇండియన్ లేడీ సూపర్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకుని నయన్‌ మంచి క్రేజ్‌తో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఇక ఇటీవల షారుఖ్ ఖాన్ హీరోగా నటించిన జవాన్ సినిమాలో హీరోయిన్‌గా నటించింది. ఈ సినిమాతో బాలీవుడ్‌కి ఎంట్రీ ఇవ్వబోతోంది. ఇదే కాకుండా ఆమె పలు సినిమాలు షూటింగ్లో బిజీగా ఉంది. ఇటీవల విఘ్నేష్ శివ‌న్‌ని పెళ్లి చేసుకున్న నయన్‌ కెరీర్ స్టార్టింగ్ నుంచి ఎన్నో ఉడిదొడుకుల‌ని ఎదుర్కొంది. పర్సనల్ జీవితంలో కూడా ఎన్నో వివాదాలు చెవిచూసిన నయనతార ప్రస్తుతం తన ఇద్దరు పిల్లలతో లైఫ్ ఎంజాయ్ చేస్తుంది.

ఇక ఇటీవల ఆమె నటించిన జవాన్ వచ్చేనెల7న‌ థియేటర్లో రిలీజ్‌కి సిద్ధంగా ఉంది. అట్లీ డైరెక్షన్లో రూపొందిన ఈ సినిమా లో నయన్ లీడ్ రోల్‌లో కనిపించనుంది. బాలీవుడ్ లో ఆమె మొదటి సినిమా జవాన్ కావడంతో అభిమానుల్లో ఓ రేంజ్‌లో అంచనాలు ఉన్నాయి. ఈ క్రమంలో ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రమోషన్స్ లో బిజీగా గడుపుతుంది నయనతార. హీరోయిన్ గా నటించిన న‌య‌న్ ప్రచార కార్యక్రమంలో కనిపించకపోవడం చర్చకు దారి తీసింది.

తన సొంత సినిమాల ప్రమోషన్‌లో బిజీగా గడిపే ఈమె న‌టించిన బాలీవుడ్ ఫైస్ట్‌ సినిమా అయినా జవాన్ ప్రమోషన్ లో కనిపించకపోవడంతో ఫాన్స్ లో ఉత్కంఠ నెలకొంది. అంతేకాకుండా కేవలం గెస్ట్‌రోల్‌ ప్లే చేసిన దీపిక పడుకొని షారుక్‌తో ప్రమోషన్లులో సందడి చేయడం మరింత ఆసక్తిగా మారింది. దీంతో నయ‌న్ ఫాన్స్ కు ఈ సినిమాలో మెయిన్‌రోల్‌ చేసింది దీపిక పదుకొనేనా లేదా నాయన్‌నా అన్ని సందేహాలు మొదలయ్యాయి. ఇప్పుడు ఇదే విషయం అటు బాలీవుడ్ నుంచి ఇటు కొలీవుడ్ వరకు తీవ్ర చర్చినియా అంశంగా వైరల్ అవుతుంది.