వయసు పెరుగుతున్న సంతూర్ మమ్మీలా కనిపించాలా.. ఈ 3 టిప్స్ ఫాలో అయితే చాలు..!!

వయసు ఎంత పెరుగుతున్న కొందరికి ముఖం మీద చర్మం అందంగా కనిపిస్తూ ఉంటుంది. ఇదే మరికొందరిలో తక్కువ వయసైనా.. వయసుతో సంబంధం లేకుండా ముఖంపై ముడతలు, చర్మం నిగారింపును కోల్పోయి కనిపిస్తూ ఉంటారు. ఈ సమస్య ఇప్పటిలో చాలామందికి ఎదురైన సమస్య అయినా.. వయసు పెరుగుతున్న ఇంకా యంగ్ కనిపించేందుకు కొన్ని చిట్కాలను పాటించి అందమైన ముఖాన్ని పొందవచ్చు. యాంటీ ఏజింగ్ చిట్కాలు కొల్లాజెన్ మన శరీరానికి అనేక విధాలుగా మద్దతులను ఇచ్చే ప్రోటీన్ల సమూహం.

శరీరంలో ఈ ప్రోటీన్ లోపం ఏర్పడితే మాత్రం దీనివల్ల చర్మం ఎక్కువగా ప్రభావితం అవుతుంది. చర్మం వదులుగా మారడం, ముడతలు, మొటిమలతో పాటు వయసు పెద్దగా కనిపిస్తూ ఉంటుంది. ఈ సమస్య నుంచి బయట పడాలంటే కొన్ని చిట్కాలను పాటించక తప్పదు. కొల్లాజెన్ అనేది మన శరీరంలో ఉండే ఫైబర్స్ ప్రోటీన్. శరీరంలో కనిపించే ప్రోటీన్ లో మూడింట ఒక వంతు కొల్లాజెన్. ఇది మన ఎముకలు, కండరాలు, చర్మం, జుట్టు ఆరోగ్యంగా ఉండడానికి సహాయపడుతుంది. కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచే కొన్ని చర్యల గురించి తెలుసుకుందాం.

1.విటమిన్ సి సీరం వాడకం:
విటమిన్ సి అనేది యాంటీ ఆక్సిడెంట్స్. ఇది అతి నీలలోహిత కిరణాల ద్వారా చర్మం లోని కొల్లాజెన్ ను దెబ్బతీయకుండా కాపాడుతుంది. ఇది కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచుతుంది. దీనికోసం ఉదయం ముఖం కడిగిన తరువాత విటమిన్ సిరమ్‌ ఫేస్ కి అప్లై చేసుకుంటూ ఉండాలి.

2. రెటినాయిడ్స్ వాడకం:
రెటినోయిడ్స్ లేదా రెటీనాల్ విటమిన్ ఎ అద్భుతమైన మూలం. ఇది కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచుతుంది. రెటినాయిల్‌ను తరచుగా వాడడం వల్ల ముడతలను తగ్గించుకోవచ్చు.

3.సన్ స్క్రీన్ వాడకం:
సన్ స్క్రీన్ స్కిన్ టానింగ్ను నిరోధించడమే కాకుండా, చర్మాన్ని యవ్వనంగా చేయడంలో సహాయపడుతుంది. యవ్వనంగా కనిపించాలంటే .సన్ స్క్రీన్ వేసవిలోనే కాకుండా ఏ కాలంలో అయినా సన్ స్క్రీన్ ఉపయోగించడం మంచిది.