తమన్నని చూడగానే అర్థమైంది.. నా నియమాలన్నీ బ్రేక్ చేశా.. విజయ్ వర్మ కామెంట్స్..!

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ తమన్నా, బాలీవుడ్ యాక్టర్ విజయ్ వర్మ ఒకరితో ఒకరు ప్రేమలో ఉన్న సంగతి తెలిసిందే. అయితే నటుడు విజయ్‌వ‌ర్మా మేమిద్దరం డేటింగ్ లో ఉన్నాము అంటూ అఫీషియల్ గానే ప్రకటించాడు. దీంతో ప్రస్తుతం ఈ జంట సోషల్ మీడియాలో ట్రెండింగ్‌ అవుతున్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న విజయవర్మ తన ప్రేమ గురించి.. తమన్నకు సంబంధించిన కొన్ని ఆసక్తికర విషయాలను చెప్పుకొచ్చాడు. విజయ వర్మ మాట్లాడుతూ నేను ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తలో ఇండస్ట్రీ కి సంబంధించిన వ్యక్తుల ఎవరితోనూ డేటింగ్ చేయకూడదని నియమం పెట్టుకున్నను అంటు చెప్పుకొచ్చాడు.

దీనికి కారణం నాకు అప్పుడు ఇండస్ట్రీపై మంచి అభిప్రాయం లేదని.. అయితే తమన్నాను కలిసిన తర్వాత నా అభిప్రాయం అంతా మారిపోయిందంటూ చెప్పుకొచ్చాడు. ఇక అప్పటి వరకు నేను పెట్టుకున్న నియమాలు, డేటింగ్ రూల్స్ అన్ని బ్రేక్ చేశాను. ఆర్ట్, బిజినెస్, ఫైనాన్షియల్ విషయాలపై అవగాహన ఉన్న ఒక వ్యక్తి మన జీవితంలోకి వస్తే ఎంత విలువ ఉంటుందో తమన్నాను చూడగానే నాకు అర్థమైంది అంటూ చెప్పుకొచ్చాడు. దీంతో అప్పటి వరకు ఉన్న ఆలోచనలు మార్పు వచ్చాయని తమన్న ఏ విషయం అయినా చాలా లోతుగా ఆలోచిస్తుందంటూ వివరించాడు. సినీ కెరీర్‌లో తన అనుభవం, పనితీరు అన్నిటికంటే ఎక్కువగా ఆమె మంచితనం నాకు చాలా ఉపయోగపడతాయి అంటూ చెప్పుకొచ్చాడు.

అలా కొన్ని విషయాలలో తమన్నా నా వే ఆఫ్ లూకింగ్ మార్చేస్తుంది అంటూ మిల్కీ బ్యూటీపై ప్రశంసలు వర్షం కురిపించాడు. ఇక వీరిద్దరూ లస్ట్ స్టోరీస్ 2 షూటింగ్ టైంలో ఒకరితో ఒకరు ప్రేమలో పడిన సంగతి తెలిసిందే. ఈ స్టోరీ ప్రమోషన్ లో వీరిద్దరూ తమ రిలేషన్ గురించి బయటపెట్టారు. విజయవర్మతో పాటు తమన్న కూడా ఈ విషయాన్ని అనౌన్స్ చేసింది. నాకోసం అందమైన ప్రపంచాన్ని సృష్టించుకున్నానని అందులోకి నన్ను నన్నుగా అర్థం చేసుకునే విజయవర్మ వచ్చాడంటూ విజయ్‌తో ప్రేమలో ఉన్న విషయాన్ని వెల్లడించింది.