దేవర సినిమాలో సెకండ్ హీరోయిన్ ఫిక్స్..అటు తిరిగి ఇటు తిరిగి ఆమెనే సెలక్ట్ చేసుకున్నాడే..!!

టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న జూనియర్ ఎన్టీఆర్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని నటిస్తున్న సినిమా దేవర. దర్శకధీరిడు రాజమౌళి లాంటి స్టార్ దర్శకుడి డైరెక్షన్లో ఆర్ఆర్ఆర్ లాంటి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అందుకున్న ఎన్టీఆర్ తర్వాత చేస్తున్న సినిమా దేవర కావడంతో ఈ సినిమాపై హ్యూజ్ ఎక్స్పెక్టేషన్స్ నెలకొన్నాయి . రీసెంట్ గానే ఆర్ఆర్ఆర్ సినిమాకి గాను ఆస్కార్ అవార్డు రావడంతో ఆయన పేరు గ్లోబల్ స్థాయిలో మారుమ్రోగిపోతుంది .

దీంతో దేవరకి సంబంధించిన చిన్న అప్డేట్ అయినా సరే గ్లోబల్ స్థాయిలో ట్రెండ్ అవుతుంది. కాగా ఇప్పటికే ఈ సినిమాలో హీరోయిన్గా అందాల ముద్దుగుమ్మ జాన్వి కపూర్ ని సెలెక్ట్ చేసుకున్నారు మేకర్స్. ఆమెకు సంబంధించిన పలు సీన్స్ ని కూడా షూట్ చేశారు. అయితే ఇప్పుడు సెకండ్ హీరోయిన్ ఎంట్రీ ఇచ్చే టైం వచ్చేసింది . సినిమాలో సెకండ్ హీరోయిన్గా నేషనల్ క్రష్ గా పేరు సంపాదించుకున్న రష్మిక మందన్నాను చూస్ చేసుకున్నాడు కొరటాల శివ .

ఎన్టీఆర్ సైతం ఆమెకే ఓటు వేశారు. అందుకే ఈ రోల్ కోసం ఎంతోమంది హీరోయిన్స్ ను అప్రోచ్ అయిన ..వాళ్లు ఓకే చేసిన ..ఫైనల్లీ రష్మిక ని చూస్ చేసుకున్నాడు కొరటాల శివ. దీంతో ఇదే న్యూస్ ఇప్పుడు వైరల్ గా మారింది . అంతేకాదు ఎన్టీఆర్ రష్మిక మందన్నాలు ఫస్ట్ టైం తెరపై కనిపించబోతున్నారు . దీంతో సినిమాపై హ్యూజ్ ఎక్స్పెక్టేషన్స్ నెలకొన్నాయి..!!