కొలావిడ్ స్టార్ హీరో విజయ్ గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. టాలీవుడ్ ప్రేక్షకుల్లో కూడా విజయ్ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. విజయ్ కుమారుడు జాసన్ సంజయ్ విజయ్‌ను దర్శకుడిగా పరిచయం చేస్తూ కొత్త సినిమా చేయబోతున్నట్లు లైకా ప్రొడక్షన్స్ అఫీషియల్ గా అనౌన్స్ చేసింది. లైకా అధినేత సుభాష్కరన్ మాట్లాడుతూ సరికొత్త ఆలోచనలతో ప్రతిభ ఉన్నవారు ఎప్పుడు గేమ్ చేంజర్స్‌గా ఉంటారని మా సంస్థను నమ్ముతుంది అంటు వివరించాడు.
మా బ్యానర్ లో నెక్స్ట్ ప్రాజెక్ట్ ను జాసన్ సంజయ్ విజయ డైరెక్టు చేయబోతున్నాడు. ఈ విషయాన్ని తెలియజేయడానికి మాకు సంతోషంగా ఉంది.. తాను చెప్పిన యూనిక్ పాయింట్ నాకు నచ్చింది.. అలాగే సంజయ్ లండన్లో స్క్రీన్ రైటింగ్ లో బిఏ పూర్తి చేశాడు అంటు చెప్పుకొచ్చాడు. విజయ్ కుమారుడు సంజయ్ టొరెంట్ అఫ్ ఫిలిమ్స్ స్కూల్లో ఫిలిం ప్రొడక్షన్ డిప్లమాను కంప్లీట్ చేశాడు.. సినిమా నిర్మాణంపై కూడా పూర్తిగా అవగాహన ఉంది.
ప్రతి ఫిలిమ్ మేకర్‌కి ఇది ఉండాల్సిన లక్షణం సంజయ్‌తో కలిసి వర్క్ చేయడం ఓ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ అవుతుందని అనుకుంటున్నాను. ఇందులో చాలా మంది స్టార్ యాక్టర్స్ పని చేయబోతున్నారు అంటు చెప్పుకొచ్చాడు. ఇక విజయ్ కుమారుడు సంజయ్ మొదటి సినిమా దర్శకత్వంతో ఓ స్టార్ డైరెక్టర్‌గా గుర్తింపు తెచ్చుకోవాలని.. విజయ అభిమానులు కోరుకుంటున్నారు.