బన్నీ చేతిపై ఉన్న ఆ టాటూ ఒక లవర్ పేరు.. అదేంటంటే..

మన టాలీవుడ్ హీరో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమా లో నటించి ప్రేక్షకులను అలరించిన బన్నీ పుష్ప సినిమాతో పాన్ ఇండియా హీరో అయిపోయాడు. తాజాగా 69వ జాతీయ పురస్కారాల్లో టాలీవుడ్ నుంచి మొట్ట మొదటిసారిగా ఉత్తమ నటునిగా అవార్డు అందుకున్న సంగతి తెలిసిందే. దీనితో మెగా ఫ్యామిలీ అంతా కూడా సంబరాలు చేసుకున్నారు.మూడు తరాల వారు తీసుకురాలేని అరుదైన గౌరవాన్ని అల్లు అర్జున్ తీసుకొచ్చి చూపించాడు. దాంతో టాలీవుడ్ సినీ ప్రముఖలతో పాటుగా, చిత్ర యూనిట్ కూడా బన్నీ కి శుభాకాంక్షలు తెలిపారు.

ఇక ఈ విజయాన్ని కుటుంబసభ్యులతో సెలెబ్రేట్ చేసుకున్నాడు బన్నీ. ముఖ్యంగా అతని భార్య స్నేహ రెడ్డి ని గట్టిగ కౌగిలించుకొని ముద్దు పెట్టుకున్నాడు. ఇందంతా పక్కన పెడితే అల్లు అర్జున్ చేతి పై ఉన్న టాటూ గురించి తెలుసుకోవాలని అందరూ ఆసక్తి చూపిస్తున్నారు. అయితే అది బన్నీ గర్ల్ ఫ్రెండ్ పేరు అని తెలుస్తుంది. మరి అల్లు అర్జున్ గర్ల్ ఫ్రెండ్ ఎవరు అని అనుకుంటున్నారా? ఆమె మరెవరో కాదు అల్లు అర్జున్ భార్య అల్లు స్నేహ రెడ్డి. స్నేహ రెడ్డి అల్లు అర్జున్ కి ఒకప్పటి గర్ల్ ఫ్రెండ్ ఇప్పటి జీవిత భాగస్వామి. ఆమె పేరుని బన్నీ తన చేతి పై స్నేహ అని టాటూ వేయించుకున్నాడు. అల్లు అర్జున్, స్నేహ రెడ్డి ప్రేమించి పెళ్లి చేసుకున్నారనే విషయం అందరికి తెలిసిందే.

ఒక కామన్ ఫ్రెండ్ ద్వారా అల్లు అర్జున్ కి పరిచయం అయింది స్నేహ. ఆ తరువాత వారిద్దరూ ప్రేమలో పడి పెద్దల సమక్షంలో వివాహం చేసుకున్నారు. అయితే మొదట స్నేహ ని బన్నీ కి ఇవ్వడం ఆమె తండ్రి చంద్రశేఖర్ రెడ్డి కి ఇష్టం లేదట. స్వయంగా అల్లు అరవింద్ వెళ్లి స్నేహ ని బన్నీ కి ఇవ్వమని అడిగినా కూడా చంద్రశేఖర్ ఒప్పుకోలేదట. కానీ స్నేహ రెడ్డి పట్టు పట్టి మరి తండ్రి ని ఓప్పించి అల్లు అర్జున్ ని వివాహం చేసుకుంది. ఇటీవలే చంద్రశేఖర్ రెడ్డి ఒక కన్వెన్షన్ హాల్ ని కట్టి, అల్లు అర్జున్ తో ఓపెనింగ్ చేయించాడు. ఈ కార్యక్రమానికి బన్నీ అభిమానులు పెద్ద ఎత్తున వచ్చారు. ప్రస్తుతం అల్లు అర్జున్ పుష్ప 2 షూటింగ్ లో చాలా బిజీ గా ఉన్నాడు. వచ్చే ఏడాది సమ్మర్ కానుకగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాభోతుంది.