మీ ఆరోగ్యాన్ని పాడు చేసే.. భారతీయ ఆహారాలు ఎంటో తెలుసా..?

చాలామంది ఆరోగ్యం పై ఎంతో శ్రద్ధ చూపిస్తూ ఉంటారు. కానీ వాళ్లకి ఏం తినాలో తినకూడదు అంతగా తెలియదు. కొన్ని భారతీయ వంటకాలు తినడం వల్ల అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ఆ వంటకాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

సమోసా:
సమోసా తినడానికి ఎంతో రుచికరంగా ఉంటుంది. కానీ దీనివల్ల ఎన్నో ఆరోగ్య సమస్యలు వస్తాయి. ఇందులో ఉండే కొలెస్ట్రాల్ వల్ల అనేక సమస్యలు వస్తాయి.

పకోడీ:
శనగపిండి వల్ల గ్యాస్ ఫామ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అలాగే వీటిని నూనెలో డీస్ ఫ్రై వల్ల కొలెస్ట్రాల్ కూడా పెరుగుతుంది.

జిలేబి:
జిలేబి తినడానికి ఎంతో రుచికరంగా ఉన్నప్పటికీ.. దీనివల్ల అనేక ఆరోగ్య సమస్యలు దరి చేరతాయి. ఒకటి రెండు తింటే ఏమీ కాదు.. కానీ ఎక్కువ తింటే గుండెపై ప్రభావం చూపించే అవకాశాలు ఉన్నాయి.

బ్రెడ్:
భారతీయ ఇళ్లలో అనేక వస్తువులను శుద్ధి చేసిన పిండితో వంటకాలు చేసుకుంటాము. కానీ షాప్ నుంచి తీసుకొచ్చుకున్న బ్రెడ్ మాత్రం శుభ్రం చేయడానికి కుదరదు. దీనివల్ల బ్రెడ్ నిల్వ ఉండడం వల్ల దాని మీద బ్యాక్టీరియా చేరుతుంది. దీని ద్వారా అనారోగ్య సమస్యలకు గురవుతారు.

పనీర్ మకానీ:
బటర్ పన్నీర్ మొదలైన క్రీమ్ ఆధారిత కూరల్లో బ్యాడ్ ఫ్యాట్ ఎక్కువగా ఉంటుంది. ఇది తినడం వల్ల గుండెకి మంచిది కాదు.

ఎగ్ పఫ్:
ఇది ఎక్కువసేపు నూనెలో వేయించడం వలన కొలెస్ట్రాల్ అధికంగా ఉంటుంది. ఇది తినడం వల్ల బరువు పెరగడం, డయాబెటిస్ వంటి సమస్యలకు గురవుతారు.