సంక్రాంతి సమరానికి సై అంటున్న టాలీవుడ్ స్టార్స్‌.. మ‌హేష్‌, నాగ్‌తో స‌హా ఎవ‌రెవ‌రు వ‌స్తున్నారంటే?

సంక్రాంతి వ‌స్తుందంటే సినీ ల‌వ‌ర్స్ కు పండ‌గే పండ‌గ‌. పెద్ద హీరోలంద‌రూ సంక్రాంతికే సంద‌డి చేస్తుంటారు. పోయిన సంక్రాంతికి చిరంజీవి, బాల‌కృష్ణ పోటీ ప‌డ్డారు. ఇద్ద‌రూ బాక్సాఫీస్ కింగ్స్ గా నిలిచారు. ఇక రాబోయే సంక్రాంతికి పోటీ మ‌రింత గ‌ట్టిగా ఉండ‌బోతోంది. టాలీవుడ్ స్టార్స్ సంక్రాంతి స‌మ‌రానికి సై అంటున్నారు. మ‌రి 2024 సంక్రాంతికి రాబోయే హీరెలెవ‌రో ఓ లుక్కేసేయండి.

గుంటూరు కారం.. సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు, త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్ కాంబోలో తెర‌కెక్కుతున్న హ్యాట్రిక్ మూవీ ఇది. శ్రీ‌లీల‌, మీనాక్షి చౌద‌రి హీరోయిన్లుగా న‌టిస్తున్నారు. షూటింగ్ ద‌శ‌లో ఉన్న ఈ చిత్రం వ‌చ్చే సంక్రాంతి పండుగ కానుక‌గా జ‌న‌వ‌రి 12న విడుద‌ల కాబోతోంది.

నా సామిరంగ.. అక్కినేని మ‌న‌థ్ముడు నాగార్జున హీరోగా తెర‌కెక్కుతున్న చిత్ర‌మిది. నాగ్ కెరీర్ లో 99వ ప్రాజెక్ట్ కాగా.. ఈ సినిమాకు విజయ్ బిన్ని దర్శకత్వం వ‌హిస్తున్నాడు. ఆస్కార్ విజేత ఎమ్ఎమ్ కీరవాణి సంగీతం అందిస్తున్నాడు. ఆల్రెడీ షూటింగ్ స్టార్ట్ అయింది. వ‌చ్చే సంక్రాంతికి నా సామిరంగ విడుద‌ల కాబోతోంద‌ని మేక‌ర్స్ ప్ర‌క‌టించారు.

ఈగల్.. మాస్ మ‌హారాజా ర‌వితేజ హీరోగా సినిమాటోగ్రాఫర్ కార్తీక్ ఘట్టమనేని ద‌ర్శ‌క‌త్వంలో రూపుదిద్దుకున్న స్పై యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ మూవీ ఇది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఈ సినిమాని ప్రతిష్టాత్మకంగా నిర్మించబోతోంది. అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ హీరోయిన్‌. ఈ మూవీ కూడా సంక్రాంతి బరిలోకి దిగబోతోంది.

హ‌నుమాన్‌.. తేజ సజ్జా హీరోగా యంగ్ అండ్ మోస్ట్ టాలెంటెడ్‌ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ తెర‌కెక్కిస్తున్న మైథ‌లాజిక‌ల్ మూవీ ఇది. అతీంద్రియ శ‌క్తుల‌తో పోరాడే ఓ యువ‌కుడిగా తేజ స‌జ్జా ఈ సినిమాలో క‌నిపిస్తున్నాడు. 2024 జ‌న‌వ‌రి 12న హ‌నుమాన్ పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ కాబోతోంది.

విడి14.. టాలీవుడ్ రౌడీ బాయ్ విజ‌య్ దేవ‌ర‌కొండ‌, డైరెక్ట‌ర్ ప‌రుశురామ్ కాంబోలో రాబోతున్న రెండో సినిమా ఇది. దిల్ రాజు నిర్మిస్తుండ‌గా.. మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా న‌టిస్తోంది. వ‌చ్చే సంక్రాంతి ఈ సినిమా కూడా విడుద‌ల కాబోతోంది.