ఈసారి జాతీయ అవార్డుల్లో ఇది గమనించారా.. ఇద్దరు సీతలు సమానంగా పంచుకున్నారుగా..!

ఇక నిన్న సాయంత్రం 69వ జాతీయ చలనచిత్ర అవార్డుల్లో ఉత్తమ నటి అవార్డులు గెలుచుకున్న ఇద్దరు హీరోయిన్లు బాలీవుడ్ నుంచే ఎంపిక కావటం నార్త్ ఆడియన్స్ ని ఆనందంలో ముంచేసింది. గంగూబాయ్ కటియవాడిలో టెర్రిఫిక్ పెర్ఫార్మెన్స్ గాను అలియా భట్ కు, మిమి సినిమాలో అదిరిపోయే నటన చూపించినందుకు కృతి సనన్‌కి జాతీయ అవార్డులు వరించాయి.

ఇక్క‌డ మరో విశేషం ఏమిటంటే ఒకరు త్రిబుల్ ఆర్ సినిమాలో సీతగా నటిస్తే.. మరొకరు ఆదుపురుష్‌ సినిమాలో జానకిగా రాముని భార్యగా నటించి మెప్పించారు. ఇది యాదృచ్ఛికంగా జరిగిన అప్పటికీ తక్కువ గ్యాప్ లో ఇద్దరు సీత‌ పేరుతో పాత్రల్లో కనిపించడం విశేషం. వారు నటించిన ఈ సినిమాల‌కు అవార్డులకు సంబంధం లేకపోయినా చెప్పుకోదగ్గ వార్తగా నిలిచింది.

ఈ విధంగా ఎలా చూస్తున్న అలియా, కృతిలు సంపూర్ణంగా అర్హత కలిగిన వాళ్ళు.. కృతీ సన్‌ కి టాలీవుడ్ తో ఎంతో అనుబంధం ఉంది. మహేష్ హీరోగా వచ్చిన 1న్ నేనొక్కడినే, నాగచైతన్యత దోచేయ్‌ వంటి సినిమాల్లో ఈమె తెలుగులో నటించింది. అయితే ఈ సినిమాలు ఈమెకు సరైన ఫలితం ఇవ్వలేక పోయాయి.దాంతో బాలీవుడ్ కి వెళ్లి అక్కడ సినిమాలు చేస్తూ అక్కడే సెటిల్‌ అయింది.

ఎక్కువగా గ్లామర్ పాత్రలకు వాడుకునే తనకు నటనతో స్కోప్ దక్కింది మిమిలోనే బాలీవుడ్ సినీ విశేషకులు కూడా ఆమెను ప్రశంసించారు. అదేవిధంగా గంగుబాయి సినిమాలో ఆలియా నటించిన వేశ్య‌ పాత్ర గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అవుతుంది. మొత్తంగా ఈ జాతీయ అవార్డుల్లో అన్ని చిత్ర పరిశ్రమల కంటే ఈసారి టాలీవుడ్ పరిశ్రమ డామినేషన్ అయితే బాగా కనిపించిందని చెప్పాలి.