వెరీ ఇంట్రెస్టింగ్.. అల్లు అర్జున్ సినిమాలతో వరుసగా రెండు సంవత్సరాలు జాతీయ అవార్డులు..!

నిన్న సాయంత్రం 2021 సినిమాలకు గాను ఈ ఏడాది నేషనల్ అవార్డులను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. 69వ జాతీయ చలనచిత్ర అవార్డుల పురస్కారంలో తెలుగు సినిమాలు సత్తా చాటాయి ఏకంగా 10 సినిమాల‌కు నేషనల్ అవార్డులని గెలుచుకుని చరిత్ర సృష్టించాయి. ఇక్కడ మరో అరుదైన విషయం ఏమిటంటే 69 సంవత్సరాలుగా ఒక తీరని కలలా ఉన్న బెస్ట్ యాక్టర్ అవార్డుని అల్లు అర్జున్ గెలుచుకొని తెలుగువారి నిరీక్షణకు ముగింపు పలికాడు. ఇక ప్రతి ఒక్క తెలుగు అభిమాని అల్లు అర్జున్‌కు ఆ అవార్డు రామటంతో ఎంతో ఆనంద పడుతున్నారు.

కాగా ఈ సంవత్సరం నేషనల్ అవార్డుల్లో అల్లు అర్జున్ నటించిన పుష్ప సినిమాకి రెండు అవార్డులు వచ్చాయి.. ఒకటి బెస్ట్ యాక్టర్ గా వస్తే మరొకటి బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్గా దేవిశ్రీప్రసాద్ కి వచ్చింది. పుష్ప సినిమాలోని పాటలు ఎంతటి సెన్సేషన్ సృష్టించాయి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ మధ్యకాలంలో నాటు నాటు పాట తర్వాత పుష్పలోని ‘ఊ అంటావా’, ‘శ్రీవల్లి’ పాట‌లు ప్రపంచ వ్యాప్తంగా ఎంతో పాపులారిటీ సంపాదించుకున్నాయి. ఈ పాటలు ఇంత పాపులర్ అవ్వడానికి దానికి ప్రధాన కారణం దేవిశ్రీ సంగీతంతో పాటు అల్లు అర్జున్ డాన్స్ కూడా కారణం

ఇదే సమయంలో గత ఏడాది కూడా అల్లు అర్జున్ ఒక నేషనల్ అవార్డుని టాలీవుడ్‌కు అందించారు. గత ఏడాది అలా వైకుంఠపురంలో సినిమాకి థ‌మన్ బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్‌గా అవార్డును గెలుచుకున్నారు. ఇక ఆ సినిమాలో బుట్ట బొమ్మ పాట ఎంత పాపులర్ అయిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇలా వరుసగా రెండు సంవత్సరాలు తెలుగు సంగీత దర్శకులకు అవార్డులు తెచ్చిపెట్టడంలో అల్లు అర్జున్ కూడా ఎంతో కీలక పాత్ర పోషించాడు. అసలే పుష్ప 2 మ్యూజిక్ పై ఓ రేంజ్ లో అంచనాలు ఉన్నాయి. ఇప్పుడు నేషనల్ అవార్డు రావడంతో ఆ అంచనాలు మరింత పెరిగిపోయాయి.