బుల్లితెర హీరో సుడిగాలి సుదీర్ ఎన్ని కోట్లకు అధిపతో తెలుసా..?

బుల్లితెరపై తన కామెడీ టైమింగ్ తో ఎప్పుడు ప్రేక్షకులను కడుపుబ్బ నవ్విస్తూ ఉంటారు సుడిగాలి సుదీర్..ఈ మధ్యకాలంలో వెండితెర పైన కూడా తన సినిమాలతో ప్రేక్షకులను మెప్పిస్తున్నారు.. చివరిగా గాలోడు సినిమాతో ఒక కమర్షియల్ హిట్ ని అందుకున్నారు సుధీర్.. బుల్లితెర షోలకంటే వెండితెరపైనే ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తూ ఉన్నారు సుధీర్. ఈ మధ్యకాలంలో సుధీర్ రెమ్యూనరేషన్ పరంగా కూడా భారీగానే పెంచినట్టు తెలుస్తోంది.. ఒక చిత్రానికి 2 నుంచి 3 కోట్ల రూపాయలు అందుకుంటున్నట్లు సమాచారం.

ప్రస్తుతం సుదీర్ గోట్ అనే సినిమాలో నటిస్తూ ఉన్నారు ఒకవేళ ఈ సినిమా సక్సెస్ అయ్యిందంటే మరొకసారి సుధీర్ రేంజ్ మారిపోతుంది.. సుధీర్ మొత్తం ఆస్తి విలువ దాదాపుగారూ .22 కోట్ల రూపాయలు ఉన్నట్లు తెలుస్తోంది. హైదరాబాదులో ఒక విలాసవంతమైన ఇల్లుతోపాటు ఒక కారు రెండు బైకులు కూడా ఉన్నట్లు సమాచారం. అయితే ఇదంతా కేవలం బుల్లితెర పైన వచ్చిన తర్వాతనే సంపాదనతో పొలాలు కొనడం వల్ల ఇంత తక్కువ సమయంలోనే అన్ని కోట్లు సంపాదించారనే వార్త బుల్లితెర వర్గాల నుంచి వినిపిస్తోంది.

సుధీర్ ఏదైనా షో చేసిన ఈవెంట్ కు వెళ్లిన దాదాపుగా 30 లక్షల రూపాయలు తీసుకుంటున్నట్లు సమాచారం. ఏ రేంజ్ లో పెరిగిపోయిందో అర్థం చేసుకోవచ్చు. జబర్దస్త్ ,ఎక్స్ ట్రా జబర్దస్త్, ఢీ , పోవే పోరా వంటిసోళ్ళతో మంచి క్రేజ్ అందుకున్న సుదీర్ ముఖ్యంగా రష్మి తో చేసేటువంటి ఎలాంటి షో అయినా సరే మంచి క్రేజ్ ను అందుకునేది.. అలా మంచి పాపులారిటీ సంపాదించుకున్న సుదీర్ వెండితెర పైన కూడా అలాంటి క్రేజ్ తో దూసుకుపోతున్నారు. సుధీర్ కి కేవలం తెలుగులోనే కాకుండా ఇతర భాషలలో కూడా మంచి ఫ్యాన్స్ ఉన్నారు.