ఎవ‌రితో మాట్లాడ‌ని ప‌వ‌న్ ఆ ఒక్క హీరోయిన్‌కు అంత స్పెష‌ల్ ప్ర‌యార్టీ ఇస్తాడా..!

పవన్ కళ్యాణ్ మిత స్వభావి అన్న సంగతి మెగా ఫ్యామిలీ చాలాసార్లు చెబుతూనే ఉంటారు. ఈ విషయం చాలామంది ప్రేక్షకులకు కూడా తెలుసు. అసలు ఆయన సినిమాల్లో హీరో అవ్వడమే పెద్ద వింత అని మా వదిన వల్ల‌ బలవంతంగా హీరోని అయ్యాను కానీ ఇంత భయం సిగ్గుతో నేను కెమెరాని ఫేస్ చేసి ఇన్ని సినిమాలు చేయడం రాజకీయాల్లోకి అడుగుపెట్టి లక్షలాదిమంది మధ్యలో నుంచొని ధైర్యంగా మాట్లాడడం నేను కలలో కూడా ఊహించలేదని పవన్ కళ్యాణ్ పొలిటికల్ మీటింగ్స్‌లో చాలా సార్లు మాట్లాడాడు.

ఏదో చిన్న పొలం పనులు చేసుకుంటూ బ్రతుకుదామని అనుకున్నాననిన‌ మాత్రమే తాను చూసుకుంటాడు. ఇటీవల సీనియర్ హీరోయిన్ య‌మున‌ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ తో తనకు ఎదురైన ఆనందకర సంఘటన గురించి చెప్పుకొచ్చింది. ఆమె మాట్లాడుతూ చిరంజీవి ఇంటికి ఓసారి వెళ్లానని పవన్ కళ్యాణ్ నీ కూడా అక్కడ కలిసానని చెప్పుకొచ్చింది. ఆయన ఇంకా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టలేదు మే బి ఇండస్ట్రీలోకి అడుగు పెట్టడానికి ప్రిపేర్ అవుతున్నాడు అనుకుంటా. అయితే చిరంజీవి గారిని కలవడానికి వెళ్తే అనుకోకుండా పవన్ కళ్యాణ్ గారితో ఏకాంతంగా 30 నిమిషాలు మాట్లాడే అవకాశం వచ్చింది చెప్పింది.

 

ఆయన ఎంతో మర్యాదపూర్వకంగా మాట్లాడాడు ఇప్పటికి నేను ఆ సంఘటన మర్చిపోలేను అంటూ ఆమె చెప్పుకొచ్చింది. ఆయన చాలా మృదుస్వభావి అని అలాంటి ఆయన ఇప్పుడు పాలిటిక్స్‌లో అంత పవర్‌ఫుల్ గా మాట్లాడటం నాకు ఆశ్చర్యాన్ని కలిగిస్తుందని అప్పట్లో కూడా ఆయన ఇలాగే ఉండేవాడేమో కానీ నేను అంతగా గమనించలేదు అంటూ వివరించింది. ఇక ఒకప్పుడు టాలీవుడ్ స్టార్ హీరోయిన్గా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఇమె ప్రస్తుతం టీవీ సీరియల్స్ లో నటిస్తూ ఫుల్ బిజీగా గడుపుతుంది. ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో అసలు ఎవరితో అయినా చాలా తక్కువగా మాట్లాడే పవన్ కళ్యాణ్ 30 నిమిషాల పాటు యమునతో అసలు ఏం మాట్లాడాడో అంటూ కామెంట్స్ చేస్తున్నారు.