ఆ మంత్రికి పవన్ ఘాటుగానే కౌంటర్ ఇచ్చారా….!

బ్రో… సాయి ధరమ్ తేజ్ హీరోగా సముద్రఖని దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో పవన్ కల్యాణ్ టైటిల్ రోల్ పోషించారు. పేరుకు హీరో సాయి ధరమ్ తేజ్ అయినప్పటికీ… సినిమా మొత్తం పవన్ కల్యాణ్ వల్లే ముందుకు సాగింది. సినిమా మొదలైన సరిగ్గా పావుగంటకు స్క్రీన్ పైకి వచ్చిన పవన్… సినిమా చివరి వరకు కనిపించారు. బ్రో సినిమాలో పవన్ సినిమాలు తొలిప్రేమ, తమ్ముడు, ఖుషి, గుడుంబా శంకర్, జల్సా సినిమాల్లోని పాటలు పెట్టడంతో పవన్ ఫ్యాన్స్ పండుగ చేసుకుంటున్నారు. వెండితెరపై పవన్ తనదైన శైలిలో కామెడీ చేయడంతో… పవన్ స్టార్ ఫ్యాన్స్ ఇప్పుడు ఫుల్ ఖుషీతో ఉన్నారు. తొలి షో నుంచే హిట్ టాక్ తెచ్చుకున్న బ్రో సినిమా… ఫుల్ లెంగ్త్ ఫ్యామిలీ ఎంటర్‌టైన్‌మెంట్‌తో పాటు… మాస్ ఆడియన్స్‌కు కనెక్ట్ అయ్యింది. దీంతో కలెక్షన్ల వర్షం తప్పదనే మాట వినిపిస్తోంది.

జనసేన పార్టీ అధినేతగా, సినిమా హీరోగా ద్విపాత్రాభినయం చేస్తున్నారు పవన్. హరిహర వీరమల్లు, ఉస్తాద్ భగత్‌సింగ్ సినిమాలు చేస్తున్న పవన్… రాజకీయాల్లో కూడా చురుగ్గానే ఉన్నారు. రాబోయే ఎన్నికల్లో వైసీపీని ఓడించడమే లక్ష్యంగా యాత్రలు, సమావేశాలు నిర్వహిస్తున్నారు పవన్. రాజకీయాల్లో బిజీగా ఉంటున్న పవన్… బ్రో సినిమాకు కేవలం 30 రోజుల కాల్ షీట్ మాత్రమే ఇచ్చారు. పవన్ డేట్స్ దొరకడమే చాలు అన్నట్లుగా ఆ సమయంలోనే పవన్ పార్ట్ మొత్తం షూట్ చేసేసి… తక్కువ సమయంలోనే సినిమా విడుదల చేశారు దర్శక నిర్మాతలు.

అయితే ఈ సినిమాలో పవన్ వేసిన కొన్ని డైలాగులు రాజకీయాలకు కూడా సింక్ అవుతున్నాయి. భూమి మీద వచ్చిన ప్రతివాడు గెస్టే… ఎప్పుడో ఒకప్పుడు టైమ్ అయిపోయాక వెళ్లిపోవాల్సిందే… అంటూ.. అంతే కానీ.. దోచేస్తాం.. అది చేస్తాం.. ఇది చేస్తాం.. అంటూ చిటికె వేశాడు పవన్. ఈ డైలాగ్ ప్రస్తుత వైసీపీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేసినట్లు ఉంది. అలాగే బ్రో టైటిల్ సాంగ్‌లో పవన్ చెప్పిన మాట.. ఏపీ జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబును టార్గెట్ చేసినట్లుగా ఉంది. ఈ ఏడాది సంక్రాంతి పండుగ సందర్భంగా వేసిన భోగి మంటల్లో అంబటి రాంబాబు డాన్స్ తో అందరినీ ఆశ్చర్యానికి గురి చేశాడు. ఇదే డాన్స్‌పై సోషల్ మీడియాలో పలు మీమ్స్ కూడా వచ్చాయి. ఇప్పుడు ఇదే డాన్స్‌పై పవన్ కూడా తనదైన శైలిలో సెటైర్లు వేశారు. ఎస్వీబీసీ ఛానల్ మాజీ ఛైర్మన్ పృద్వీరాజ్ పాత్రకు శ్యామ్ బాబు అనే పేరు పెట్టిన పవన్… ఆయన వేస్తున్న డాన్స్‌ను తప్పుబడతారు. నీ ఏజ్ ఏమిటీ.. నువ్వేసే స్టెప్పులేమిటీ.. అంటూ డైలాగ్ వేశారు. ఈ సీన్‌లో పృద్వీరాజ్ డ్రెస్ కూడా అంబటి రాంబాబు వేసినట్లుగానే సేమ్ టూ సేమ్ టీ షర్ట్ వేసి అలాగే డాన్స్ వేయించారు. దీంతో థియేటర్‌లో వీడియో తీస్తున్న పవన్ ఫ్యాన్స్ ఆ వీడియోను సోషల్ మీడియాలో అప్ లోడ్ చేస్తూ… అంబటి రాంబాబుకు కౌంటర్ అని కామెంట్లు పెడుతున్నారు.