బాపట్లలో టీడీపీ సీట్లు ఫిక్స్..అక్కడే నో క్లారిటీ?

వచ్చే ఎన్నికల్లో పోటీకి టి‌డి‌పి నేతలు సిద్ధమయ్యారు. దాదాపు చాలా సీట్లలో అభ్యర్ధులు ఫిక్స్ అయ్యారని తెలుస్తుంది. అధికారికంగా ఇంకా ఫిక్స్ కాలేదు గాని..చంద్రబాబు పోటీ చేసే అభ్యర్ధులకు క్లారిటీ ఇచ్చేశారు. ఇక జనసేనకు ఏ ఏ సీట్లు వదిలిపెట్టాలని అంశంపై కూడా టి‌డి‌పి నేతలకు దిశానిర్దేశం చేసినట్లు సమాచారం. ఇదే సమయంలో బాపట్ల పార్లమెంట్ పరిధిలో దాదాపు టి‌డి‌పి అభ్యర్ధులు ఫిక్స్ అయినట్లే కనిపిస్తుంది.

బాపట్ల పరిధిలో టి‌డి‌పికి పట్టు ఎక్కువ ఉంది. గత ఎన్నికల్లో బాపట్ల పరిధిలో నాలుగు సీట్లని టి‌డి‌పి గెలుచుకుంది. అద్దంకి, పర్చూరు, రేపల్లె, చీరాల సీట్లు గెలుచుకుంది. సంతనూతలపాడు, వేమూరు, బాపట్ల సీట్లు వైసీపీ గెలుచుకుంది. ఇక ఇప్పుడు ఇక్కడ క్లీన్ స్వీప్ చేసే దిశగా టి‌డి‌పి వెళుతుంది. 7కి 7 సీట్లలో టి‌డి‌పికి ఆధిక్యం కనిపిస్తుంది. గట్టిగా కష్టపడితే స్వీప్ చేయడం పెద్ద కష్టమేమీ కాదు. ఇక దాదాపు 7 సీట్లలో అభ్యర్ధులు ఫిక్స్ అయ్యారనే చెప్పవచ్చు.

ఎలాగో సిట్టింగ్ ఎమ్మెల్యేలు అద్దంకిలో గొట్టిపాటి రవికుమార్, పర్చూరులో ఏలూరి సాంబశివరావు, రేపల్లెలో అనగాని సత్యప్రసాద్ పోటీ చేయడం ఖాయం. ఇక సంతనూతలపాడులో బి‌ఎన్ విజయ్ కుమార్, వేమూరులో నక్కా ఆనంద బాబు, బాపట్లలో వేగేశన నరేంద్ర వర్మ పోటీ చేస్తారు. ఇక చీరాల విషయంలోనే క్లారిటీ లేదు. గత ఎన్నికల్లో ఇక్కడ టి‌డి‌పి నుంచి కరణం బలరామ్ గెలిచిన విషయం తెలిసిందే.

తర్వాత ఆయన వైసీపీలోకి వెళ్లారు. దీంతో ఎం‌ఎం కొండయ్యని ఇంచార్జ్ గా పెట్టారు. మరి ఆయనకు సీటు ఇస్తారా? లేదా పొత్తులో భాగంగా ఈ సీటు జనసేనకు ఇస్తారా? అనే క్లారిటీ లేదు. ఎలాగో పొత్తులో భాగంగా మిగిలిన సీట్లని జనసేనకు ఇవ్వడం కష్టమే. ఇస్తే చీరాల మాత్రమే ఇవ్వాలి.