ఆ కారణంగానే ఐరన్ లెగ్ శాస్త్రి.. జీవితంలో అన్ని కష్టాలా..?

టాలీవుడ్ ప్రేక్షకులకు ఎప్పుడు గుర్తుండిపోయే నటనను ప్రదర్శించిన నటులలో ఐరన్ లెగ్ శాస్త్రి కూడా ఒకరు.. ఏన్నో చిత్రాలలో నటించి తనకంటూ ఒక స్థానాన్ని సంపాదించుకున్న ఈయన అసలు పేరు విశ్వనాథ శాస్త్రి.. కానీ ఆయన ఐరన్ లెగ్ అనే పేరుతో మంచి పాపులారిటీ సంపాదించారు.. ప్రేమఖైదీ అనే సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఈ నటుడు ఆ తర్వాత జంబలకడిపంబ, అప్పుల అప్పారావు తదితర సినిమాలలో నటించి మంచి పేరు సంపాదించారు. అలా స్టార్డం వచ్చిన అతి తక్కువ కాలంలోనే స్టార్డంను దూరం చేసుకున్న నటుడు కూడా ఈయనే.

Comedy Kings - Marriage Broker Ironleg Sastri - Rajendraprasad, Gundu  Hanumantha Rao - YouTube

ఇండస్ట్రీల అవకాశాలు తగ్గడంతో తిరిగి ఆయన స్వగ్రామానికి వెళ్లిపోయారు. ఒకవైపు ఆర్థిక ఇబ్బందులు మరొకవైపు అనారోగ్య సమస్యలతోనే చిన్నవయసులోనే కన్నుమూసినట్టుగా తెలుస్తోంది.. ఆయన మరణించిన తర్వాత ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఆయన కొడుకు కూడా ఎక్కువ రోజులు అక్కడ నిలదొక్కుకోలేకపోయారు. గతంలో పలు ఇంటర్వ్యూలో మాట్లాడి తన తండ్రి గురించి ఆసక్తికరమైన విషయాలను తెలిపారు ప్రసాద్.

ప్రసాద్ మాట్లాడుతూ పురోహిత్యం కోసం హైదరాబాదుకు వచ్చిన తన తండ్రి సినిమా ప్రారంభోత్సవాలకు పూజలు నిర్వహించే వారట.. అదే సమయంలో ఒకసారి హారతి ఆయన దగ్గరకు రాగానే ఆరిపోవడంతో అక్కడున్న వారంతా నవ్వేశారట.. ఇదంతా చూసిన డైరెక్టర్ ఈవివి సత్యనారాయణ ఆయన పాత్రను క్రియేట్ చేసి సినిమాలలో నటించే అవకాశాన్ని కల్పించారట. ఆలా ఇండస్ట్రీలో ఐరన్ లెగ్స్ శాస్త్రిగా గుర్తింపు సంపాదించుకున్నారు.

ఆ ట్యాగ్ తన తండ్రి జీవితాన్ని నిర్ణయించలేకపోయిందని తెలిపారు ప్రసాద్. ఒకసారి పనిమీద బెంగళూరుకు వెళ్తూ ఉంటే అర్థరాత్రి బస్సు ఆగిపోయిందట.. అందులో ఐరన్ లాక్ శాస్రి బస్సులో ఉండడం వల్లే ఆగిపోయిందని బస్సు రిపేర్ అయ్యాక ఆయనను అక్కడే వదిలేసి వెళ్లిపోయారని తెలిపారు.. ఇక పలు సినిమాలలో అవకాశాలు వచ్చిన ఆయనను పెట్టుకుంటే సినిమా ఆగిపోతుందని డిజాస్టర్ అవుతుందని రూమర్స్ కూడా క్రియేట్ చేశారు. దీంతో తన తండ్రికి అవకాశాలు తగ్గిపోయాయని దీంతో స్వగ్రామానికి వచ్చిన తన తండ్రి అనారోగ్య సమస్యలతో మరణించారని తెలిపారు.