చిన్న రీజన్ తో ప్రభాస్ బ్లాక్ బస్టర్ సినిమాని మిస్ చేసుకున్న మహేశ్-చిరంజీవి.. ఆ మూవీ ఇదే..!!

సినిమా ఇండస్ట్రీ అంటేనే రంగుల ప్రపంచం . ఇది ఓ మాయాలోకం.. ఎప్పుడు ఏం జరుగుతుందో ..ఎవరు గెస్ చేయలేరు . స్టార్స్ గా ఉన్నలాంటి వాళ్లు కూడా జీరో గా మారిపోతూ ఉండడం ..ఈ మధ్యకాలంలో మనం చూస్తూనే ఉన్నాం. మరీ ముఖ్యంగా పాన్ ఇండియా లెవెల్ లో రిలీజ్ అయిన సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద అట్టర్ ఫ్లాప్ టాక్ సంపాదించుకుంటున్నాయి . అందుకే ఏ హీరో కూడా టాప్ ..ఏ హీరో కూడా ఫ్లాప్ అని చెప్పలేని పరిస్థితి నెలకొంది సినిమా ఇండస్ట్రీలో…

కాగా ఇలాంటి క్రమంలోనే సినిమా ఇండస్ట్రీలో కొందరు స్టార్స్మిస్ చేసుకున్న సినిమాలను మళ్లీ ట్రెండ్ చేస్తున్నారు కుర్రాళ్లు. ఈ క్రమంలోనే ప్రభాస్ కెరియర్ లోనే కూల్ అండ్ క్లాసిక్ హిట్ గా పేరు సంపాదించుకున్న “చక్రం”.. సినిమాను రిజెక్ట్ చేసిన ఇద్దరు హీరోల పేర్లు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి . కృష్ణవంశీ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా ఛార్మి, అసిన్ హీరోయిన్గా నటించిన సినిమా “చక్రం”.

ఈ సినిమా అప్పట్లో ఎంతటి ఫ్యామిలీ హిట్ అందుకుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . మరీ ముఖ్యంగా ఒక మనిషి లైఫ్ లో ఎలా బ్రతకాలి..? ఎలా ముందుకు వెళ్లాలి..? అని క్లియర్గా చూపించింది ఈ సినిమానే. కమర్షియల్ గా పెద్ద హిట్ కానప్పటికీ మ్యూజిక్ పరంగా ..సెంటిమెంట్ పరంగా సూపర్ డూపర్ హిట్ అయింది . ఈ క్రమంలోనే ఈ సినిమా కధను మొదట కృష్ణవంశీ ..చిరంజీవికి వివరించారట .అయితే లాస్ట్ లో హీరో పాత్ర చనిపోతూ ఉండడంతో చిరంజీవి ఇంట్రెస్ట్ చూపించలేదట . అంతేకాదు ఆ తర్వాత మహేష్ బాబుకి కథ వివరించగా కథ పెద్దగా ఆయనకు నచ్చలేదని రిజెక్ట్ చేసాడట . ఫైనల్లీ కథను ప్రభాస్ కి తీసుకెళ్ళి వివరించగా.. ప్రభాస్ – కృష్ణంరాజు విని ఓకే చేశారట. ఆ తర్వాత షూటింగ్ కంప్లీట్ చేయడం.. రిలీజ్ చేయడం చక చక జరిగిపోయాయి. పెద్దగా కమర్షియల్ గా హిట్ కాకపోయినా సరే సెంటిమెంట్ పరంగా అందరి మనసులను దోచేసింది “చక్రం” సినిమా..!!

Share post:

Latest