“ఆయన ఏమన్నా అంత పెద్ద తోపా..?”..రాజమౌళి డైరెక్షన్ పై తేజ సంచలన కామెంట్స్ వైరల్..!!

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ గా పేరు సంపాదించుకున్న తేజ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . ఆయన కెరియర్ లో ఎన్నో బ్లాక్ బోస్టర్ హిట్ సినిమాలో ఉన్నాయి. నితిన్ – సదా నటించిన జయం సినిమా ఎంతటి హిట్ అందుకుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . ఇప్పటికీ ఈ సినిమా టీవీలో వస్తే టీవీకి అతుక్కుపోయి చూసే జనాలు బోలెడు మంది ..అలాంటి క్రేజీ క్రేజీ హిట్లు అందుకున్న తేజ ప్రజెంట్ పొజిషన్ ఎంత దారుణంగా ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు . కాగా దగ్గుబాటి వారసుడు అభిరామ్ ను పెట్టి ” అహింస” అనే పేరుతో ఓ సినిమా తీస్తున్న విషయం తెలిసిందే .

ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా రీసెంట్గా యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తేజ పలు షాకింగ్ విషయాలను బయటపెట్టారు . ఇలాంటి క్రమంలోనే హోస్ట్ “మీరు తీస్తున్న అన్ని సినిమాలు ఒకే జోనర్ కింద ఉంటాయి . ఒకే కంటెంట్ కలగల్సి ఉంటుంది. ఒకే టైం ట్రావెల్ తో మూవ్ అవుతూ ఉంటుంది . ఎందుకు ..? ” అంటూ ప్రశ్నించారు . దీంతో కోప్పడిన తేజ అతగాడికి చాలా రఫ్ అండ్ టఫ్ ఆన్సర్ ఇచ్చారు .

“ఇండస్ట్రీలో నేనే కాదు చాలామంది డైరెక్టర్స్ కూడా అలాగే ఒకే జోనర్ కథలను చూస్ చేసుకుంటూ ఉంటారు. ఎవరి స్టైల్ వారికి ఉంటుంది. ఆస్కార్ అందుకున్ని పాన్ ఇండియా లెవల్ లో క్రేజ్ సంపాదించుకున్న ఎస్ఎస్ రాజమౌళి లాంటి వాళ్లు కూడా ఒకే టైప్ ఆఫ్ జోనర్ లో సినిమాలు తీస్తూ ఉంటారు . మీరు గమనించినట్లయితే .. రాజమౌళి మొదటి నుంచి తీసిన సినిమాలు..ఇప్పుడు తీస్తున్న సినిమాలు ఒకే విధంగా ఉంటాయి.. అది వాళ్ళ స్టైల్ ” అంటూ బోల్డ్ గా ఆన్సర్ ఇచ్చాడు . ఈ క్రమంలోనే తేజ ఇచ్చిన ఆన్సర్ పై తేజ ఫాన్స్ హర్షం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు ప్రతి ఒక్కరూ రాజమౌళిని ఎందుకు అంతలా పొగిడేస్తున్నారు …? ఆయన ఏమన్నా పెద్ద తోపా..? ఆయన డైరెక్షన్ స్కిల్స్ బాగుంటాయి..ఆ సినిమాలో నటించిన హీరోలు కష్టపడుతున్నారు.. అది జనాలకు నచ్చి హిట్టు కొట్టింది ..అంతే కదా..? రాజమౌళి కన్నా ముందే ఇండస్ట్రీలో ఎంతోమంది గొప్ప మహా తోపు డైరెక్టర్లు కూడా ఉన్నారు. వాళ్ళ పేరులు ఎందుకు పాపులారిటీ అవ్వట్లేదు..? అంటూ కామెంట్స్ చేస్తున్నారు..!!

Share post:

Latest