చిన్న కార‌ణంతో ప్ర‌భాస్ `డార్లింగ్‌`ను రిజెక్ట్ చేసి.. ఆ త‌ర్వాత బాధ‌ప‌డ్డ హీరో ఎవ‌రో తెలుసా?

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సినీ కెరీర్ లో అభిమానులతో పాటు సినీ ప్రేక్ష‌కుల‌కు కూడా ఎప్పటికీ గుర్తుండిపోయే చిత్రాల్లో `డార్లింగ్` ఒకటి. ఏ కరుణాకరన్ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ ను శ్రీ వెంక‌టేశ్వ‌ర సినీ చిత్ర ఎల్ఎల్‌పి బ్యాన‌ర్ పై బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మించారు. ఇందులో ప్ర‌భాస్‌, కాజ‌ల్ అగ‌ర్వాల్ జంట‌గా న‌టించారు.

2010 ఏప్రిల్ 23న విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాన్ని నమోదు చేసింది. ఛ‌త్రపతి వంటి బ్లాక్ బస్టర్ హిట్ అనంతరం దాదాపు అర డజన్ ఫ్లాపుల‌ను మూట‌గ‌ట్టుకున్న‌ ప్రభాస్ మళ్లీ డార్లింగ్ తో సక్సెస్ ట్రాక్ ఎక్కాడు. అయితే చాలా మందికి తెలియని విషయం ఏంటంటే.. డార్లింగ్ మూవీ కు ఫస్ట్ ఛాయిస్ ప్రభాస్ కాద‌ట‌. ప్ర‌భాస్ కంటే ముందే ఈ సినిమా క‌థ ఓ టాలీవుడ్ స్టార్ హీరో వ‌ద్ద‌కు వెళ్ల‌గా.. ఆయ‌న రిజెక్ట్ చేశాడట‌.

ఇంత‌కీ ఆ హీరో మ‌రెవ‌రో కాదు.. అల్లు అర్జున్. ఆ టైమ్ లో ల‌వ్ స్టోరీస్ కు కేరాఫ్ గా ఉన్న అల్లు అర్జున్ కు డార్లింగ్ ప‌ర్ఫెక్ట్ గా సూట్ అవుతుంద‌ని డైరెక్ట‌ర్ క‌రుణాక‌ర‌న్ భావించాడ‌ట‌. ఈ నేప‌థ్యంలోనే బ‌న్నీని క‌లిసి క‌థ వినిపించాడ‌ట‌. అయితే కథ నచ్చినప్పటికీ వరస ప్రాజెక్ట్స్ కారణంగా డేట్స్ కాళీ లేవు అన్న చిన్న కారణంతో బ‌న్నీ `డార్లింగ్‌` మూవీని రిజెక్ట్ చేశాడట. ఆ తర్వాత ప్రభాస్ తో సినిమా చేయగా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. దాంతో అనవసరంగా డార్లింగ్ వంటి సూపర్ హిట్ మూవీని వదులుకున్నందుకు అల్లు అర్జున్ కాస్త బాధపడ్డాడట.

Share post:

Latest