బాలయ్య బడా ప్రాజెక్ట్, 3 భాగాలు.. కమల్‌, మోహన్‌లాల్‌ ఎంట్రీ.. డైరెక్టర్‌ ఎవరంటే?

వరుస సక్సెస్‌లతో మంచి జోరుమీదున్నారు బాలయ్య. ఈ క్రమంలోనే తాజాగా ఓ సంచలన ప్రాజెక్ట్ అని అనౌన్స్ చేసి అందరికీ షాక్ ఇచ్చారు. అవును, మీరు విన్నది నిజమే. సౌత్‌ బిగ్గెస్ట్ స్టార్స్ తో కలిసి బాలయ్య ఓ మల్టి స్టారర్ సినిమా చేయబోతున్నారు. కన్నడ సూపర్‌ స్టార్‌ శివరాజ్‌ కుమార్‌ ఇటీవల ఎన్టీఆర్‌ శతజయంతి వేడుకలో బాలకృష్ణతో చేయబోతున్న సినిమాని ప్రకటించడం విశేషం. ఈ క్రమంలో బాలకృష్ణ ఓ సెన్సేషనల్‌ ప్రాజెక్ట్ సెట్‌ చేశారని తెలిపారు. త్వరలో తాము కలిసి నటించబోతున్నామని, దాన్ని తానే నిర్మిస్తున్నట్టు కూడా ఆయన వెల్లడించారు.

ఇక ఇందులో తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్‌ కూడా నటించనున్నారు. రజనీకాంత్‌తోపాటు శివరాజ్‌కుమార్‌, కమల్ హాసన్, మోహన్ లాల్ కూడా నటించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇది రెండు భాగాలుగా రాబోతుందని, దానిని శివరాజ్‌ కుమార్‌ తన సొంత ప్రొడక్షన్‌లో నిర్మించబోతున్నట్టు తెలుస్తోంది. కాగా ఈ సినిమాకి కన్నడ డైరెక్టర్‌ దర్శకత్వం వహిస్తారని ప్రచారం జరుగుతోంది. శివరాజ్‌ కుమార్‌తో `వేద` సినిమాని రూపొందించిన హర్ష సదరు సినిమాకి దర్శకత్వం వహిస్తారట.

త్వరలోనే ఇది పట్టాలెక్కబోతుందని కూడా ప్రచారం జరుగుతుంది. ఈ సినిమా రెండు పార్ట్ లు మాత్రమే కాదండోయ్, మూడు పార్ట్ లుగా రాబోతుందట. మొదటి పార్ట్ లో బాలకృష్ణ, శివరాజ్‌కుమార్‌ నటిస్తారట. రెండో పార్ట్ లో బాలకృష్ణ, రజనీ కాంత్‌ నటిస్తారని తెలుస్తుంది. అటు రజనీకాంత్‌ కూడా దీనికి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారనే టాక్‌ గట్టిగా వినబడుతోంది. దీంతో ఇప్పటికే ఈ ప్రాజెక్ట్‌ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. అదేవిధంగా మూడో భాగంలో లోకనాయకుడు కమల్‌ హాసన్‌, మలయాళ సూపర్‌ స్టార్‌ మోహన్‌లాల్‌ కూడా నటిస్తున్నారట. ప్రస్తుతం ఈ వార్త సౌత్‌లో సంచలనంగా మారింది.

Share post:

Latest