ప‌విత్ర‌ని పెళ్లి చేసుకున్నాక పిల్లల్ని కూడా కంటారా..? రిపోర్టర్ బోల్డ్ ప్రశ్నకి న‌రేష్ స్ట్రైట్ ఆన్సర్..!!

వామ్మో .. ఇప్పుడు సోషల్ మీడియాలో .. సినిమా ఇండస్ట్రీలో.. వెబ్ మీడియాలో ఎక్కడ చూసినా సరే నరేష్ – పవిత్ర ల పేర్లు ఏ రేంజ్ లో మారుమ్రోగిపోతున్నాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ జంట పెళ్లి చేసుకుంటారో లేదో తెలియదు కానీ ..పెళ్లి చేసుకున్న భార్యాభర్తల కన్నా ఎక్కువగా హంగామా సృష్టిస్తున్నారు అంటూ జనాలు నవ్వుకుంటున్నారు . మనకు తెలిసిందే ఎం ఎస్ రాజు దర్శకత్వంలో నరేష్ – పవిత్ర లోకేష్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన సినిమా “మళ్లీ పెళ్లి”. ఈ సినిమా టోటల్ నరేష్ – పవిత్రల రియల్ లైఫ్ ఇన్సిడెంట్ ఆధారంగా తెరకెక్కింది అని ట్రైలర్ తోనే అర్థం అయిపోయింది.

రీసెంట్ గానే హైదరాబాదులో గ్రాండ్గా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఏర్పాటు చేసిన సినిమా టీం ఏ రేంజ్ లో సినిమా ప్రమోషన్స్ ని హైప్ ఇస్తుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ క్రమంలోనే రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నరేష్ – పవిత్ర తమ లైఫ్ కి సంబంధించిన టాప్ సీక్రెట్స్ బయటపెట్టింది . అసలు వాళ్ళ ప్రేమ ఎలా మొదలైంది ..? వాళ్ళ పరిచయం ఎలా స్టార్ట్ అయింది..? అని క్లియర్ కట్ గా చెప్పేసారు . పలు సినిమా షూటింగ్స్ లో కలిసిన నరేష్- పవిత్రలు ఫైనల్లీ న్యూ ఇయర్ రోజు ఒకటయ్యారట .

మొదటి నుంచి పవిత్ర అంటే స్పెషల్ ఇంట్రెస్ట్ ఉన్న నరేష్ ..ఆమెను సమ్మోహనం సినిమా సెట్స్ లోనే ప్రపోజ్ చేశారట . అయితే చాలా టైం గ్యాప్ తీసుకున్న తర్వాత పవిత్ర లోకేష్ నరేష్ లవ్ ని యాక్సెప్ట్ చేశారట. కాగా ఇదే క్రమంలోనే ఓ రిపోర్టర్ “పెళ్లి తర్వాత మీరు పిల్లల్ని కంటారా..? అన్న ప్రశ్నకు నరేష్ బోల్డ్ గా ఆన్సర్ ఇచ్చినట్లు సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. ” ప్రెసెంట్ మాకు అలాంటి ఉద్దేశం లేదు .. అది ఏమన్నా ఉంటే పెళ్లి తర్వాత ఆలోచిస్తాం “అంటూ చెప్పకు వచ్చారట. ప్రజెంట్ ఇదే న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఏది ఏమైనా సరే “మళ్లీ పెళ్లి” సినిమాతో ఇండస్ట్రీలో మరో సంచలనానికి తెర తీయ్యబోతున్నారు ఈ కపుల్.చూద్దాం మరి మే 26వ తేదీన ఏం జరుగుతుందో..?

 

Share post:

Latest