యాపిల్ బ్యూటీ హన్సిక ఓ టాలీవుడ్ ఆగ్ర హీరో నుంచి లైంగిక వేధింపులను ఎదుర్కొందని రెండు రోజుల నుంచి నెట్టింట పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న హన్సిక.. తనను ఓ ప్రముఖ టాలీవుడ్ హీరో వేధించాడని, డేట్‌కి రావాలంటూ తరచూ వెంటపడేవాడని, అతడి టార్చర్ భరించలేక తగిన విధంగా బుద్ధి చెప్పాను అని వెల్లడించినట్లు వార్తలు వచ్చాయి.
దీంతో హన్సికను వేధించిన ఆ టాలీవుడ్ హీరో ఎవరు అని నెటిజన్లు ఆరాలు తీయడం ప్రారంభించారు. అయితే ఇలాంటి తరుణంలో హన్సిక బిగ్ ట్విస్ట్ ఇచ్చింది. అసలు తాను అలాంటి కామెంట్స్ చేయలేదని.. తనను ఓ టాలీవుడ్ హీరో లైంగికంగా వేధించాడు అని వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని కుండబద్దలు కొట్టేసింది.
ఇలాంటి నిరాధారమైన వార్తలతో విసిగిపోయాను. దయచేసి ఇటుంటి కథనాలను ప్రచురించే ముందు వాస్తవాలను తెలుసుకోండి. మీడియాకు నేను విజ్ఞప్తి చేసేది ఇదే అంటూ హన్సిక ట్విట్టర్ ద్వారా పోస్ట్ పెట్టింది. దీంతో అసలు నిజం బయటపడింది. కాగా, గత ఏడాది స్నేహితుడు, వ్యాపారవేత్త అయిన సోహైల్ తో పెళ్లి పీటలెక్కిన హన్సిక.. ప్రస్తుతం తెలుగు, తమిళ భాషల్లో చేతినిండా ప్రాజెక్ట్ లతో ఫుల్ బిజీగా గడుపుతోంది.