“ఆ హీరోయిన్స్ మారాలి”.. సైలెంట్ గా మంట పెట్టిన శృతి హాసన్..!!

సినిమా ఇండస్ట్రీలో శృతిహాసన్ కి ఎలాంటి క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . మరీ ముఖ్యంగా కమలహాసన్ డాటర్ గా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన సరే తండ్రి పేరును ఎక్కడ తన సినిమాల కోసం వాడుకోకుండా సొంత టాలెంట్ తో ఒక్కొక్క స్టెప్ వేస్తూ పైకి ఎదిగింది . సినిమా ఇండస్ట్రీకి వచ్చిన కొత్తల్లో ఒక్క హిట్ కొట్టడానికి శృతిహాసన్ దాదాపు పది సినిమాల ప్లాపులను తన ఖాతాలో వేసుకుంది. దీన్నిబట్టే చెప్పొచ్చు అమ్మడు ఎంత మొండిగా ఉంటుందో ..

కాగా గబ్బర్ సింగ్ సినిమాతో ఫస్ట్ హిట్ తన ఖాతాలో వేసుకున్న శృతిహాసన్ ఆ తర్వాత తనదైన స్టైల్ లో గుర్తింపు సంపాదించుకుంది . రీసెంట్ గానే వీర సింహారెడ్డి -వాల్తేరు వీరయ్య అంటూ బ్యాక్ టు బ్యాక్ రెండు బడా హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకున్న శృతిహాసన్ .. రీసెంట్గా కేన్స్ ఫిలిం ఫెస్టివల్ లో పాల్గొంది . ఈ క్రమంలోనే అమ్మడు డైస్ పై మాట్లాడుతూ నేటి తరం హీరోయిన్స్ పై సంచలన కామెంట్స్ చేసింది.

” ఇండస్ట్రీలో ఇంకా వివక్ష ఉండనే ఉంది . ఆడ మగ అంటూ వ్యత్యాసం చూపిస్తున్నారు. ఇప్పుడు ఇప్పుడే ఆడవాళ్లు బయటకు వచ్చి సొంత కాళ్లు పై నిలబడడానికి ట్రై చేస్తున్నారు . మార్పు మంచిదే ఈ మార్పు నెమ్మదిగా మొదలైన రానున్న రోజుల్లో మంచి చేస్తుంది అని ఆశిద్దాం. సినిమా ఇండస్ట్రీలో ఉండే హీరోయిన్స్ అందరూ ఏక దాటి నిర్ణయం పై ఉండాలి.. యూనిటీగా ఉంటే మనల్ని ఎవ్వరూ ఆపలేరు ..రెమ్యూనరేషన్ విషయంలో కూడా మనం మారాలి .. హీరోలతో సమానంగా హీరోయిన్స్ కష్టపడుతున్నారు.. అయితే ఎక్కడ తగిన న్యాయం గుర్తింపు రావట్లేదు ..ఈ క్రమంలోనే హీరోయిన్స్ ఆ విషయాల్లో మారాలి.. ఒక్క మాటపై ఉంటూ కలిసికట్టుగా ఉండాలి” అంటూ చెప్పుకొచ్చింది . ఈ క్రమంలోనే శృతిహాసన్ మాట్లాడిన మాటలు వైరల్ గా మారాయి..!!

 

 

View this post on Instagram

 

A post shared by Shruti Haasan (@shrutzhaasan)

Share post:

Latest