సైలెంట్ అయిన శృతిహాసన్.. కారణం..?

ఈ ఏడాది వరుసగా రెండు సూపర్ హిట్ చిత్రాలతో మంచి విజయాలను అందుకుంది హీరోయిన్ శృతిహాసన్. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ సలార్ సినిమాలో నటిస్తోంది. ఈ సినిమా తర్వాత మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు.. సలార్ సినిమాలో తన పోర్షన్ ఎప్పుడో పూర్తి చేసుకున్న శృతిహాసన్ నెక్స్ట్ సినిమాని ఇంకా ప్రకటించలేదు. దీంతో అభిమానులు చాలా ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. టాలీవుడ్లో శృతిహాసన్ కెరియర్ ఆల్మోస్ట్ అయిపోయింది అనుకుంటున్నా సమయంలో ఒకేసారి మూడు సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

Shruti Haasan shares adorable pic with beau Santanu from her birthday bash  | Bollywood – Gulf News
అందులో రెండు సూపర్ హిట్ చిత్రాలు కాగా ఇప్పుడు శృతిహాసన్ మళ్లీ తెలుగులో సైలెంట్ అయిపోయింది అనే వార్తలు వినిపిస్తున్నాయి. కెరీర్ కన్నా తన ఫోకస్ మొత్తం ఎక్కువగా బాయ్ ఫ్రెండ్ తో ఎంజాయ్ చేస్తూ వాటిపైనే దృష్టి పెడుతోంది. టాలీవుడ్ లో తనకు బాగా నచ్చిన సినిమా అయితేనే చేయాలనుకుంటోంది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. మొత్తానికి శృతిహాసన్ తెలుగులో బిజీ అవ్వాలనుకున్న ఆమె దగ్గరకు వెళ్లి దర్శక నిర్మాతల సంఖ్య నెమ్మదిగా తగ్గిపోతున్నట్లు తెలుస్తోంది.

Which quality of Assam's boyfriend Shantanu Hazarika attracts actress Shruti  Haasan ? - Db News

శృతిహాసన్ సినిమాల ఫోకస్ కంటే బాయ్ ఫ్రెండ్ తో వెకేషన్కు ఎంజాయ్ చేయడానికి ఎక్కువ మక్కువ చూపుతూ ఉండడంతో అభిమానుల సైతం పెళ్లి విషయాన్ని అయినా ఎప్పుడు చెబుతావు అంటూ పలువురు అభిమానుల సైతం శృతిహాసన్ అడుగుతూ ఉన్నారు.ప్రస్తుతం ఒక చిత్రానికి రూ .4కోట్ల రూపాయల వరకు రెమ్యూనరేషన్ అందుకుంటున్నట్లు సమాచారం. ఏదో ఒక చిత్రంలో స్పెషల్ సాంగ్లో నటించబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మరి శృతిహాసన్ పైన వస్తున్న రూమర్లకు చెక్ పెట్టే విధంగా ఏదైనా సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇస్తుందేమో చూడాలి మరి.

Share post:

Latest