డైరెక్టర్ తో గొడవపై క్లారిటీ ఇచ్చిన తమన్నా..!!

తెలుగు సినీ డైరెక్టర్ అనిల్ రావుపూడి ప్రస్తుతం స్టార్ డైరెక్టర్ గా కొనసాగుతున్నారు. గతంలో ఎన్నో బ్లాక్బస్టర్ చిత్రాలను తెరకెక్కించిన ఈ డైరెక్టర్ ప్రస్తుతం బాలయ్య సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నారు. ఇందులో కాజల్ అగర్వాల్, శ్రీ లీల నటిస్తూ ఉన్నారు. ఈ చిత్రంలోని తమన్నా ఒక స్పెషల్ సాంగ్లో నటించబోతోంది అంటూ గత కొద్దిరోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి.ఈ విషయం పైన క్లారిటీ కూడా ఇచ్చింది. అయినా కూడా ఈ వార్తలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఇవన్నీ ఒట్టి రూమర్స్ అని తెలియజేసిన తమన్నా అంతలోనే డైరెక్టర్ అనిల్ రావు పూడితో తమన్నాకు గొడవలు ఏర్పడ్డాయి అంటూ రూమర్స్ కూడా వైరల్ గా మారుతున్నాయి.

Anil Ravipudi responds to clashes with Tamanna తమన్నా తో గొడవ నిజమే

గత కొద్దిరోజులుగా సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్న ఈ విషయంపై తమన్నా క్లారిటీ ఇచ్చినట్లుగా తెలుస్తోంది .తమ గురించి వస్తున్న నిరాధారమైన వార్తలను చూసి తనకు చాలా బాధ కలిగిందంటూ నేను పని చేయడానికి ఎప్పుడూ కూడా ఆనందిస్తాను.. అనిల్ రావు పూడి, నందమూరి బాలకృష్ణ సార్ అంటే తనకు చాలా గౌరవం ఉన్నది.. తమ గురించి రాసే ఇలాంటి వార్తలు చూసి చాలా బాధగా అనిపించింది అంటూ తెలియజేస్తోంది తమన్నా.

ఇలాంటి ఆరోపణలు చేసే ముందు దయచేసి ఒకసారి ఆలోచించండి అంటూ తమన్నా ట్విట్టర్ నుంచి తెలియజేసింది. దీంతో డైరెక్టర్ అనిల్ రావు పూడితో గొడవలపై ఎట్టకేలకు క్లారిటీ ఇవ్వడం జరిగింది తమన్నా. గతంలో వీరిద్దరి కాంబినేషన్లో ఎఫ్-2,f-3 చిత్రాలు విడుదలయ్యాయి ఈ సినిమా షూటింగ్ సమయంలో తమన్నా అనిల్ రావిపూడి కి మధ్య చిన్న గొడవ జరిగిందని ఆ తర్వాత వీరిద్దరూ మాట్లాడుకోలేదని రూమర్స్ వినిపించాయి. కానీ ఇలాంటివి ఏమీ లేవంటూ తమన్నా ట్విట్టర్ ద్వారా క్లారిటీ ఇచ్చింది.

https://twitter.com/tamannaahspeaks/status/1659845350855958528?s=20

Share post:

Latest