భీమవరంలో టీడీపీ యాక్టివ్..పవన్ పోటీ చేయట్లేదా?

ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో టి‌డి‌పి దూకుడుగా ఉంది. గత ఎన్నికల్లో దారుణంగా ఓడిపోయినా సరే..అక్కడ నుంచి టి‌డి‌పి వేగంగా పుంజుకుంటూ వస్తుంది. ఎలాగో ఈ జిల్లా టి‌డి‌పికి కంచుకోటగా ఉంది. దీంతో జిల్లాలో పార్టీ పికప్ అవుతూ వస్తుంది. ఇదే క్రమంలో ఇక్కడ జనసేన బలం కూడా పెరుగుతుంది. కొన్ని సీట్లలో జనసేనకు పట్టు ఉంది. ఇక ఈ రెండు పార్టీలు గాని కలిసి పోటీ చేస్తే జిల్లాలో మెజారిటీ సీట్లు సొంతం చేసుకోవడం ఖాయం.

కాకపోతే పొత్తు ఉంటే ఏ సీటు ఎవరికి దక్కుతుందనే క్లారిటీ రావడం లేదు. ప్రస్తుతం ఉన్న పరిస్తితుల్లో నరసాపురం, తాడేపల్లిగూడెం, భీమవరం స్థానాలు జనసేనకు దక్కే అవకాశాలు ఉన్నాయని ప్రచారం ఎప్పటినుంచో జరుగుతుంది..కానీ ఆ సీట్లలో కూడా టి‌డి‌పి బలంగా ఉంది..ఆయా స్థానాల్లో టి‌డి‌పి నేతలు యాక్టివ్ గా రాజకీయాలు చూస్తున్నారు. తాడేపల్లిగూడెంలో వలవల బాబ్జీ దూకుడుగా పనిచేస్తున్నారు. పైగా ఆయనకు సీటు గ్యారెంటీ అన్నట్లు టి‌డి‌పి అధిష్టానం నుంచి సిగ్నల్ వచ్చినట్లు తెలుస్తోంది.

ఇక గత ఎన్నికల్లో పవన్ పోటీ చేసి ఓడిపోయిన భీమవరంలో కూడా టి‌డి‌పి యాక్టివ్ గా కార్యక్రమాలు చేస్తుంది. గత ఎన్నికల్లో టి‌డి‌పి నుంచి పోటీ చేసి ఓడిపోయిన పులిపర్తి ఆంజనేయులు టి‌డి‌పికి దూరమయ్యారు. దీంతో తోట సీతారామలక్ష్మీని ఇంచార్జ్ గా పెట్టారు. ఆమె భీమవరంలో పార్టీని చూసుకుంటున్నారు. ఇక అక్కడ టి‌డి‌పి క్యాడర్ యాక్టివ్ గా ఉంది. అలాగే క్షేత్ర స్థాయిలో పార్టీ పదవుల పంపకాలు జరుగుతున్నాయి. ఇలా టి‌డి‌పి యాక్టివ్ గా ఉన్న నేపథ్యంలో భీమవరంలో అసలు పవన్ పోటీ చేస్తున్నారా? లేదా? అనే డౌట్ వస్తుంది.

అయితే ఇంతవరకు ఆయన ఎక్కడ పోటీ చేస్తారో క్లారిటీ రాలేదు. ఒకవేళ పొత్తు ఉంటే పవన్ ఎక్కడ పోటీ చేసిన గెలవడం ఖాయమని చెప్పవచ్చు.