ర‌వితేజ హ్యాట్రిక్‌ ఆశ‌ల‌పై నీళ్లు జ‌ల్లిన `రావ‌ణాసుర‌`.. 3 రోజుల్లో వ‌చ్చింది ఎంతో తెలుసా?

మాస్ మ‌హారాజా ర‌వితేజ, డైరెక్ట‌ర్ సుధీర్ వ‌ర్మ కాంబినేష‌న్ లో తెర‌కెక్కిన `రావ‌ణాసుర‌` రీసెంట్ గా ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. అను ఇమ్మాన్యుయేల్, మేఘా ఆకాష్, ఫరియా అబ్దుల్లా, దక్షా నాగర్కర్, పూజిత పొన్నాడ ఇందులో హీరోయిన్లుగా న‌టించారు. ఏప్రిల్ 7న భారీ అంచ‌నాల న‌డుమ విడుద‌లైన ఈ చిత్రానికి మిక్స్డ్ టాక్ ల‌భించింది.

అయిన‌ప్ప‌టికీ మంచి ఓపెనింగ్స్ రాబ‌ట్టిన ఈ చిత్రం.. రెండో రోజు నుంచి బాక్సాఫీస్ వ‌ద్ద డ‌ల్ అయిపోయింది. రూ. 23 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన ఈ చిత్రం మూడు రోజుల్లో తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా రూ. 8.32 కోట్లు రాబ‌ట్టింది. అలాగే ప్ర‌పంచ‌వ్యాప్తంగా రూ. 9.93 కోట్ల షేర్ తో స‌రిపెట్టుకుంది.

ధ‌మాకా, వాల్తేరు వీర‌య్య చిత్రాల‌తో డ‌బుల్ బ్లాక్ బ‌స్ట‌ర్స్ అందుకున్న ర‌వితేజ.. ఈ సినిమాతో హ్యాట్రిక్ కొట్టాల‌ని చూశాడు. కానీ, ఆయ‌న ఆశ‌పై రావ‌ణాసున నీళ్లు జ‌ల్లింది. బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే ఇంకా రూ. 13.07 కోట్ల షేర్‌ను అందకోవాల్సిన అవ‌స‌రం ఉంది. కానీ, ఆ స్థాయిలో వ‌సూళ్ల‌ను రాబ‌ట్టడం క‌ష్ట‌మే అని అంటున్నారు. ఇక ఏరియాల వారీగా రావ‌ణాసుర 3 డేస్ టోట‌ల్ కలెక్ష‌న్స్ ను ఓ సారి గ‌మనిస్తే..

నైజాం: 3.36 కోట్లు
సీడెడ్: 1.32 కోట్లు
ఉత్త‌రాంధ్ర‌: 1.23 కోట్లు
తూర్పు: 63 ల‌క్ష‌లు
పశ్చిమ: 41ల‌క్ష‌లు
గుంటూరు: 67 ల‌క్ష‌లు
కృష్ణ: 42 ల‌క్ష‌లు
నెల్లూరు: 28 ల‌క్ష‌లు
—————————————–
ఏపీ+తెలంగాణ‌= 8.32 కోట్లు(13.85 కోట్లు~ గ్రాస్)
—————————————–

కర్ణాట‌క‌+రెస్టాఫ్ ఇండియా – 0.66 కోట్లు
ఓవ‌ర్సీస్‌- 0.95 కోట్లు
——————————————–
టోటల్ వరల్డ్ వైడ్ = 9.93 కోట్లు(17.70 కోట్లు~ గ్రాస్)
——————————————–