ఆయన వల్లే జబర్దస్త్ మానేశాను.. చమ్మక్ చంద్ర..!!

జబర్దస్త్ బుల్లితెరపై ఎంతోమంది కమెడియన్స్ సైతం ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నారు. అలాంటి వారిలో చమ్మక్ చంద్ర కూడా ఒకరు. ముఖ్యంగా జబర్దస్త్ స్టేజ్ పైన లేడీ స్కిట్ల ద్వారా భారీగా ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించారు. మొదట్లో కంటిస్టెంట్ గా వచ్చిన చంద్ర ఆ తర్వాత టీమ్ లీడర్ గా కూడా సెటిల్ అయ్యారు. ఇక జబర్దస్త్ వేదిక మీద ఎన్నో స్కిట్లు చేసిన చంద్ర సినిమాలలో కూడా ఎంట్రీ ఇచ్చి మంచి ప్రేక్షకు ఆదరణ పొందారు.

Chammak Chandra - Zee5 News

జబర్దస్త్ షో నుంచి నాగబాబు వెళ్ళిపోయాక చమ్మక్ చంద్ర అసలు కనిపించలేదు.. ఆ తర్వాత జీ టీవీలో ప్రచారమైన అదిరింది అనే ప్రోగ్రాంలో కనిపించారు.ఆ తర్వాత మాటీవీలో కామెడీ ప్రోగ్రామ్స్ అనే వాటిలో చేసి మధ్యలో మానేసి తిరిగి జబర్దస్త్ లోకి వచ్చారు.. అయితే చంద్ర అలా చేయడానికి తన ఆరోగ్య సమస్యలే కారణమని తెలియజేయడం జరిగింది. ఇక సెట్లో ప్రతి ఒక్కరిని నాగబాబు పట్టించకుంటారని ప్రతి టీం లో కూడా ఏ కంటెస్టెంట్ బాగా చేశారు వారి పేరును మెచ్చుకుంటూ ఉంటారని తెలిపారు.

సమాజంలో చాలా మంది అలా బతుకుతున్నారు.. చమ్మక్ చంద్రపై నాగబాబు కామెంట్స్  వైరల్ | Nagababu Comments on Chammak Chandra Birthday - Telugu Filmibeat

అలా రెండు మూడు స్కిట్లు చూశాక సరిగ్గా చేయకపోతే నాగబాబు గారు పిలిచి మరి వార్నింగ్ ఇచ్చే వారిని తెలిపారు ..ఇలా చేయండి అలా చేయండి అంటూ ఎన్నో సలహాలు కూడా ఇచ్చేవారని తెలిపారు. ఇక శ్యాం ప్రసాద్ రెడ్డి గారు ఆయన కూతురు సేట్లో అందరికీ ఏం కావాలో అవి ఇచ్చేవారని తెలిపారు.. జబర్దస్త్ నుంచి చాలామంది కమెడియన్ ఫేమస్ అయ్యారు వారికి అవకాశాలు వెతుక్కుంటూ సినిమాలలో వస్తున్నాయని తెలిపారు.