అప్పలరాజుకే చిక్కులు..మరో 23 ఎమ్మెల్యేలకు సీటు కష్టం.!

ఇటీవల ఏపీ రాజకీయాల్లో మంత్రి అప్పలరాజు ఎక్కువగా వినిపిస్తుంది..మొదట ఆయన పేరు ఎక్కువగా వచ్చేది అక్రమాలు విషయంలో పలాసలో ఆయన భూ కబ్జాలకు పాల్పడుతున్నారని, ఇంకా చాలా అక్రమాలకు పాల్పడుతున్నారని పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తున్నాయి. అదే సమయంలో మంత్రిగా ఆయన సక్సెస్ అవ్వలేదని విమర్శలు వస్తున్నాయి. ఇదే తరుణంలో ఆయనని మంత్రివర్గం నుంచి తప్పిస్తున్నారనే ప్రచారం పెద్ద ఎత్తున వస్తుంది. ఇప్పటికే జగన్..రెండుసార్లు అప్పలరాజున తనవద్దకు పిలిపించుకున్నారని టాక్ నడిచింది.

దీంతో అప్పలరాజు మంత్రి పదవి పోతుందని ప్రచారం పెద్ద ఎత్తున వచ్చింది. ఇదే సమయంలో నెక్స్ట్ ఎమ్మెల్యే సీటు కూడా ఇవ్వట్లేదనే ప్రచారం మొదలైంది. తాజాగా జగన్ వర్క్ షాపు నిర్వహించిన విషయం తెలిసిందే. అందులో ఎమ్మెల్యేలకు జగన్ క్లాస్ ఇవ్వలేదు గాని..పనితీరు బాగోని కొందరు ఎమ్మెల్యేలతో విడివిడిగా మాట్లాడినట్లు మాత్రం తెలిసింది. దాదాపు 24 మంది ఎమ్మెల్యేలతో ఆయన మాట్లాడారని అందులో అప్పలరాజు కూడా ఉన్నారని తెలిసింది. ఇక వీరికి నెక్స్ట్ సీటు ఇవ్వలేనని జగన్ తేల్చి చెప్పినట్లు ప్రచారం మొదలైంది.

దీంతో మీడియా..తాజాగా అప్పలరాజుని ప్రశ్నల వర్షం కురిపించింది. మొన్నేమో తన మంత్రి పదవిని తీసేశారని, ఇప్పుడు ఎమ్మెల్యే పదవిని కూడా మీరే తీసేశారని, అసలు మీకు ఇవన్నీ ఎలా వస్తాయో తెలియట్లేదని, తాను మరింత ఉత్సాహంతో పనిచేస్తానని అప్పలరాజు మీడియాతో అన్నారు.

అంటే ఎమ్మెల్యే పదవి కూడా పోతుందో లేదో క్లారిటీ ఇవ్వలేదు. కానీ ఏదేమైనా గాని కొంతమంది ఎమ్మెల్యేలకు మాత్రం జగన్ సీటు ఇవ్వడం కష్టమని తెలుస్తోంది. అయితే సీటు రానివారిని వేరే విధంగా ఆదుకుంటానని జగన్ అంటున్నారు. చూడాలి మరి ఎంతమందికి సీట్లు ఉండవో.