ముద్దు పెట్టి సారీ చెప్పేవాడు.. చైతు గుట్టు ర‌ట్టు చేసిన దక్షా!

హుషారు, జాంబీ రెడ్డి వంటి చిత్రాల్లో మెరిసిన అందాల భామ దక్షా నగార్కర్.. `బంగార్రాజు` సినిమాతో గుర్తింపు సంపాదించుకుంది. ఈ చిత్రంలో ఆమె పాత్ర చిన్న‌దే అయినా నాగ‌చైత‌న్య‌తో కెమిస్ట్రీ బాగా పండించింది. అలాగే గ్లామ‌ర్ తోనూ ఆక‌ట్టుకుంది. ఇక ఈ సినిమా సక్సెస్ మీట్ సమయంలో నాగ చైతన్యకు కళ్ళతో సైగల్ చేస్తూ మీడియాకు చిక్కింది.

అప్ప‌ట్లో ఇందుకు సంబంధించిన వీడియో బాగా వైర‌ల్ అయింది. ఈ క్ర‌మంలోనే చైతు, దక్షా మ‌ధ్య స‌మ్‌థింగ్ స‌మ్‌థింగ్ అంటూ వార్త‌లు కూడా వ‌చ్చాయి. ఇదిలా ఉంటే.. నాగ‌చైత‌న్యపై తాజాగా ద‌క్షా ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేసింది. ద‌క్షా న‌టించిన `రావ‌ణాసుర‌` చిత్రం విడుద‌ల‌కు సిద్ధ‌మైంది. మాస్ మ‌హారాజా ర‌వితేజ, సుధీర్ వ‌ర్మ కాంబోలో రూపుదిద్దుకున్న ఈ సినిమా ఏప్రిల్ 7న విడుద‌ల కాబోతోంది.

ఈ నేప‌థ్యంలోనే ఓ ఇంట‌ర్వ్యూలో పాల్గొన్న ద‌క్షా.. చైతు గుట్టు ర‌ట్టు చేసింది. అత‌ను ఎలాంటో వాడో చెప్పేసింది. `చైతు చాలా సింపుల్ అబ్బాయి. అలాంటి అబ్బాయిని ప్రతి అమ్మాయి కోరుకుంటుంది. అతను అమ్మాయిల విషయంలో చాలా కేర్ తీసుకుంటాడు. అలాగే అమ్మాయిలను గౌరవిస్తాడు. బంగార్రాజు మూవీ షూటింగ్ లో నన్ను హగ్ చేసుకోవడానికి.. ముద్దులు పెట్టుకోవడానికి చాలా ఇబ్బంది పడ్డాడు. షూటింగ్ తర్వాత సారీ చెప్పేవాడు.` అంటూ ద‌క్షా చెప్పుకొచ్చింది. దీంతో ఈమె కామెంట్స్ కాస్త నెట్టింట హాట్ టాపిక్ గా మారాయి.