సినిమా అనేది ఒక రంగుల ప్రపంచం. ఇక్కడ ఎవరు సక్సెస్ అవుతారో ఎవరు అడుగంటి పోతారో చెప్పలేని పరిస్థితి. మంచి పేరు తెచ్చుకుని ఆ తర్వాత సినిమాల నుంచి తెరమరుగయ్యేటప్పుడు యాక్టర్స్ పడే మానసిక బాధ వర్ణనాతీతం. ముఖ్యంగా హీరోయిన్లు ఈ విషయాన్ని అసలు తీసుకోలేరు. అందుకే అవకాశాల కోసం వారు ఎంతకైనా తెగిస్తుంటారు. కాగా తాజాగా కృష్ణ గాడి వీరప్రేమగాధ మూవీ హీరోయిన్ మెహ్రీన్ ఎవరూ ఊహించని రీతిలో దిగజారింది.
ప్రస్తుతం ఈ అమ్మడు చేతిలో తమిళ్ సినిమా ఒకటి , కన్నడ సినిమా ఒకటి ఉన్నాయి. కేవలం మెహ్రిన్ కి రెండు సినిమాలే ఉండటం, అవి కూడా పెద్దగా కిట్టయ్య సినిమా లాగా కనిపించడం లేదు. దీనితో ఈ ముద్దుగుమ్మ ఏం చేయాలో తెలియక ఆందోళన పడుతుంది. మరి అందరు హీరోయిన్ల లాగా సోషల్ మీడియాలో తన ప్రతాపం చేస్తుందా అంటే అదీ లేదు. ఎప్పుడో ఒక ఫోటోషూట్ తప్పించి పెద్దగా అందాలు ఆరబోసే పని కూడా పెట్టుకోదు ఈ ముద్దుగుమ్మ. అయితే ఇప్పుడు మెహ్రీన్ తన నిర్ణయాన్ని మార్చుకున్నట్లు తెలుస్తోంది. చాలా కాలం తర్వాత లేటెస్ట్ గా తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక ఫోటోషూట్‌తో ఆకట్టుకునే ప్రయత్నం చేసింది. తన అందాల పరువాలతో కుర్రాళ్లకు పిచ్చేకిస్తుంది. కొంటె చూపుతో అందరికీ మతేక్కిస్తుంది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారుతున్నాయి.
ఎఫ్ 3 సినిమా తర్వాత అవకాశాలు రాక బాధ పడుతుంది ఈ బ్యూటీ. అంతకుముందు ఆమె నటించిన అశ్వద్ధామ ,మంచి రోజులు వచ్చాయి , ఎంత మంచి వాడవురా లాంటి సినిమాలు వరుసగా పరాజయం పాలయ్యాయి. దాంతో ఆమె కెరియర్ కాస్త డౌన్ అయింది. మరొకవైపు ఎఫ్ 3 సినిమా కోసమే ఎంగేజ్మెంట్ చేసుకొని తర్వాత క్యాన్సిల్ చేసుకుంది. సినిమాల కోసం మాజీ సీఎం కొడుకును కూడా వదులుకున్న ఈమె కెరియర్ పై దృష్టి పెట్టిందనుకున్నారు. కానీ సీరియస్‌గా ప్రయత్నాలు మాత్రం చేయట్లేదని అర్థం అవుతుంది. ఇప్పుడు అవకాశాలు వెతుక్కుంటున్నా కూడా, వస్తాయో లేదో మాత్రం అర్థం కావడం లేదు. మొత్తానికైతే ఈమె కెరీర్ ఇప్పుడు డేంజర్ జోన్ లో పడినట్టు తెలుస్తోంది. అందుకే అందాల ఆరబోత కార్యక్రమం పెట్టుకుంది. మరి ఇలానైనా ఈమెకు అవకాశాలు వస్తాయేమో చూడాలి.