వామ్మో.. శాకుంతలం చిత్రం కోసం అన్ని కేజీలు బంగారు ఉపయోగించారట..?

సమంత హీరోయిన్గా డైరెక్టర్ గుణశేఖర్ దర్శకత్వంలో రాబోతున్న చిత్రం శాకుంతలం. ఈ చిత్రం ఏప్రిల్ 14వ తేదీన పాన్ ఇండియా లెవెల్లో విడుదల కాబోతోంది. ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్ టీజర్ ట్రైలర్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. తాజాగా ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా డైరెక్టర్ గుణశేఖర్ పలు ఆసక్తికరమైన విషయాలను తెలియజేయడం జరిగింది. ముఖ్యంగా ఈ చిత్రంలోని సమంత ధరించిన బంగారు ఆభరణాల గురించి పలు ఆసక్తికరమైన విషయాలను తెలిపారు.

Samantha's Shakuntalam Whopping Amount Of Gold Used For During Shoot Of  Movie | Shakuntalam: అట్లుంటది గుణశేఖర్ తోని-'శాకుంతలం' కోసం ఎన్ని కేజీల  బంగారం వాడారో తెలుసా?

శాకుంతలం సినిమా కోసం దాదాపుగా రూ .14 కోట్ల రూపాయలు విలువైన నిజమైన బంగారు మరియు వజ్రాల ఆభరణాలను డైరెక్టర్ గుణశేఖర్ చేయించారట. గతంలో దానవీరశూరకర్ణ చిత్రంలో నిజమైన బంగారు ఆభరణాలు వాడారు అనే విషయం తెలిసిందే .ఆస్పూర్తితోనే ఈ సినిమా కోసం ఇప్పుడు ఇలా బంగారు ఆభరణాలు ఉపయోగించినట్లుగా డైరెక్టర్ తెలియజేశారు.మొత్తం ఆభరణాలను వసుంధర జ్యువెలర్స్ నుండి తెప్పించామని ప్రముఖ డిజైన్ నీతూ లుల్లా వీటిని డిజైన్ చేసినట్లుగా తెలిపారు.

సుమారుగా సమంత పోషించిన శాకుంతలం పాత్ర కోసం 15 కేజీల బంగారాన్ని ఉపయోగించామని 14 రకాల ఆభరణాలను చేయించామని తెలిపారు. ఇక విషయంతో మహారాజ పాత్ర కోసం ఏకంగా 10 కేజీల బంగారు ఆభరణాలను చేయించినట్లుగా చిత్ర బృందం తెలుపుతోంది. గుణశేఖర్ ఎక్కువగా భారీ మొత్తంలోనే సెట్స్ కోసం ఖర్చు చేస్తూ ఉండేవారు.. కానీ ఈసారి మాత్రం బంగారం కోసం అధికంగా ఖర్చు చేసినట్లుగా తెలియజేశారు. దిల్ రాజు సమర్పణలు ఈ సినిమాని పాన్ ఇండియా లెవెల్లో విడుదల చేస్తున్నారు. మరి సమంతకు సరైన సక్సెస్ ఇస్తుందేమో చూడాలి మరి.

Share post:

Latest