యంగ్ హీరో సుధీర్ వర్మ సూసైడ్ కేసులో మిస్టరీ ట్విస్ట్..మ‌ర‌ణానికి కార‌ణం అదే!?

టాలీవుడ్ ఇండ‌స్ట్రీలో వ‌రుస విషాదాలు చోటుచేసుకుంటున్న సంగ‌తి తెలిసిందే. నిన్న ఎంతో భ‌విష్య‌త్తు ఉన్న యంగ్ హీరో సుధీర్ వ‌ర్మ సూసైడ్ చేసుకోవ‌డం తెలుగు సినీ ప‌రిశ్ర‌మ‌కు క‌ల‌వ‌ర పాటుకు గురి చేసింది. వైజాగ్‌లోని తన నివాసంలో ఆత్మహత్య చేసుకుని సుధీర్ వ‌ర్మ మృతి చెందాడు. సెకండ్‌ హ్యండ్‌, కుందనపు బొమ్మ, షూటౌట్‌ ఎట్‌ ఆలేరు వంటి సినిమాల్లో న‌టించిన సుధీర్ వ‌ర్మ‌.. ఇంత చిన్న వ‌య‌సులోనే బలవన్మరణానికి పాల్పడటం అందరినీ కలిచి వేసింది.

అయితే తాజాగా సుధీర్ వ‌ర్మ సూసైడ్ కేసులో మిస్ట‌ర్ ట్విస్ట్ వెలుగులోకి వ‌చ్చింది. పాయిజన్ తీసుకుని చనిపోయినట్టు విశాఖ డాక్టర్ల పోస్ట్‌మార్టం రిపోర్ట్ చెప్తోంది. అయితే సుదీర్ వ‌ర్మ మూడు రోజుల క్రిత‌మే విషం తాగాడ‌ట‌. జనవరి 18న విషం తీసుకొని సుధీర్ వ‌ర్మ ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు. ఈ విషయం గమనించిన ఆయన కుటుంబసభ్యులు చికిత్స నిమిత్తం సుధీర్‌ వర్మను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు.

ప్రాథమిక చికిత్స అనంతరం సుధీర్‌ను విశాఖలోని ఎల్‌. జీ. ఆస్పత్రిలో చేర్పించి చికిత్స చేయించడం మొదలు పెట్టారు. చికిత్స పొందుతూనే సోమవారం తెల్లవారుజామున కార్డియాక్ అరెస్ట్‌తో సుధీర్ మృతి చెందాడు. కాగా, ఆయన సూసైడ్‌ చేసుకోవడానికి గల కారణాలను బంధువులు తెలిపారు. గత కొన్ని రోజులుగా సుధీర్‌ అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నాడ‌ని.. ఆ సమస్యలను తట్టుకోలేక సూసైడ్ చేసుకున్నాడ‌ని వెల్లడించారు. ఇది ఎంత వ‌ర‌కు నిజం అన్న దానిపై పోలీసులు విచార‌ణ చేస్తున్నారు.