వైభ‌వంగా జ‌రిగిన‌ కేఎల్‌ రాహుల్- అతియా శెట్టి వివాహం.. ఫోటోలు వైర‌ల్‌!

టీమిండియా స్టార్‌ క్రికెటర్ కేఎల్ రాహుల్ ఓ ఇంటివాడు అయ్యాడు. బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి కుమార్తె, ప్ర‌ముఖ న‌టి అతియా శెట్టితో గత కొన్నేళ్ల నుంచి ప్రేమాయ‌ణం న‌డిపిస్తున్న రాహుల్‌.. ఫైన‌ల్ గా ఆమెతో ఏడ‌డుగులు న‌డిచి బ్యాచిల‌ర్ లైఫ్ కు ఎండ్ కార్డ్ వేశాడు.

వీరి వివాహానికి ముంబై వేదిక‌గా మారింది. ఖండాలాలో సునీల్ శెట్టి కుటుంబానికి చెందిన లగ్జరీ ఫాంహౌస్ లో జ‌న‌వ‌రి 23న‌ కేఎల్ రాహుల్‌, అతియా శెట్టి వివాహం అంగ‌రంగ వైభ‌వంగా జ‌రిగింది. ఇరువురి కుటుంబసభ్యులు, బంధుమిత్రులు ఈ పెళ్లికి హాజరయ్యారు.

బాలీవుడ్ సీనియర్ నటుడు అనుపమ్ ఖేర్, ఇషాంత్ శర్మ, అన్షుల్ కపూర్, కృష్ణా ష్రాఫ్ తదితరులు హాజరయ్యారు. టీమిండియా క్రికెటర్లు ప్రస్తుతం న్యూజిలాండ్ తో మూడో వన్డేకు సిద్ధమవుతుండడంతో జట్టులోని వారెవరూ ఈ పెళ్లికి రాలేదు.

ఇకపోతే లైట్ పింక్ కలర్ సంప్రదాయ దుస్తుల్లో వ‌ధూవ‌రులు అందంగా మెరిసిపోతూ క‌నిపించారు. ప్ర‌స్తుతం వీరి పెళ్లి ఫోటోలు సోష‌ల్ మీడియాలో తెగ చ‌క్క‌ర్లు కొడుతున్నాయి.

 అభిమానులు, క్రికెటర్లు, సినీ, రాజకీయ ప్రముఖులు ఈ నూత‌న దంప‌తుల‌కు సోష‌ల్ మీడియా వేదిక‌గా విషెస్ తెలుపుతున్నారు. కాగా, ఐపీఎల్ 2023 ముగిసిన త‌ర్వాత రాహుల్- అతియా శెట్టి రిసెప్ష‌న్ ఉంటుంద‌ని సునీల్ శెట్టి మీడియాతో తెలిపారు.